మోదీతో దోస్తీ కోసం చంద్రబాబు ఇంత దిగజారాలా?

2019కి ముందు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపికి మద్దతును ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే  భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఉన్నాయి. కానీ అప్పుడు జగన్ బిజెపిని సమర్థించడంపై తెలుగుదేశం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏ విధంగానూ స్పందించలేదు‌. అయితే ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఎన్డీఏ నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది‌.

అలా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుండి బయటికి వచ్చేసిన తర్వాత 2019 లో తెలుగుదేశం పార్టీ తన మనసులోని మాటను బయటపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తున్నారని వాపోయారు అప్పుడు చంద్రబాబు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీ వాళ్లు జగన్ మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తున్నారని కూడా ఆయన అప్పుడు అన్నారు. మరి ఇప్పటి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలవాలని ఊవిళ్ళూరుతుంది.  

తెలుగుదేశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి  మద్దతును ఇస్తుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తే విమర్శించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేస్తున్న పని ఏంటని కొంత మంది అడుగుతున్నారు. అలా అయితే చంద్రబాబు నాయుడు కి కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తుంది కదా. మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి వెళ్లి భారతీయ జనతా పార్టీతో తగవులాడాలా?  తగవులాడి కేంద్రానికి శత్రువులా మారాలా అని వాళ్ళు అడుగుతున్నారు.

గతంలో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి మద్దతును ప్రకటించినప్పుడు తెలుగుదేశం వాళ్ళు జగన్ అలాగే బీజేపీ ఇద్దరూ జతకట్టారని వ్యాఖ్యలు చేశారు. మరి మొన్న నాలుగు బిల్లులపై ఓటింగ్ జరిగింది‌. దానికి తెలుగుదేశం అలాగే వైసిపి కూడా తమ మద్దతును ఇచ్చాయి. ఒకరు మద్దతు ఇస్తున్నారని మరొకరు తమ మద్దతును ఉపసంహరించుకోలేదు. అలాగని దీని అర్థం వాళ్ళిద్దరూ దోస్తీ కట్టినట్టు కాదు కదా అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: