అలా జరిగితే తప్ప.. ఆర్సిబి కప్పు గెలవలేదు : హర్భజన్

praveen
గత 16 సీజన్స్ నుంచి కూడా అభిమానులు అందరిని నిరాశ పరుస్తూ వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక ఇప్పుడు 17వ సీజన్లో కూడా నిరాశ మిగిల్చబోతుందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఆ జట్టు అభిమానులు సైతం అవును అనే సమాధానం చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. అద్భుతంగా రానించి టైటిల్ కలను నెరవేర్చుకుంటుంది అని అందరూ అనుకున్నారు. అంతకుముందు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి మహిళల జట్టు టైటిల్ గేలవడంతో ఈసారి పురుషుల జట్టు కూడా ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని భావించారు. కానీ ఊహించని రీతిలో అభిమానులకు నిరాశ ఎదురయింది.

 మొదటి మ్యాచ్ నుంచి కూడా చెత్త ప్రదర్శన చేస్తూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస ఓటమిలతో సతమతం అవుతుంది. ఇప్పుడు వరకు 9 మ్యాచ్లలో ఆర్సిబి జట్టు కేవలం రెండే రెండు విజయాలు మాత్రమే సాధించి ఇక పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ జట్టు టైటిల్ గెలవడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.  ఈ క్రమంలోనే ఆర్సిబి ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక సొంత అభిమానులు సైతం ఇంకెన్నాళ్లు టైటిల్ కోసం వేసి చూడాలి అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఆర్సిబి టైటిల్ గెలవకపోవడం గురించి భారత మాజీ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాణ్యమైన బౌలర్లు లేనంతవరకు ఆర్సీబీ టైటిల్ సాధించలేదు అంటూ హర్భజన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్టార్ బ్యాట్స్మెన్ లతో ఎల్లప్పుడూ మ్యాచ్ గెలవలేం. మంచి బౌలర్లు కూడా జట్టులో ఉండాలి. కానీ అలాంటి బౌలింగ్ దళం ఆర్సిబికి లేదు. వచ్చే వేలంలోనైనా నాణ్యమైన బౌలర్లను తీసుకోవాలి. అప్పుడే జట్టులో సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే ఆర్సిబి సపోర్టింగ్ స్టాప్ లో కూడా భారతీయులు ఉండాలి. ఇదంతా జరిగితేనే ఆ జట్టు కప్పు కొట్టగలదు అంటూ హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: