రాగి పిండి Vs గోధుమ పిండి... ఏది తింటే ఆరోగ్యానికి మంచిదంటే..!

lakhmi saranya
రాగి పిండి, గోధుమపిండి రెండు ఆరోగ్యానికి మంచివే. ఏది తిన్నా శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. అయితే ఈ రెండిటి ఇండ్లలో ఏది ఎక్కువ మంచిదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మరి రాగి పిండి, గోధుమపిండి ఈ రెండిటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు చూద్దాం. ధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ఈ ధాన్యాల్లో ఎక్కువగా గోధుమలు, రాగులు, జొన్నలు ముఖ్యం. వీటితో తయారుచేసిన పెండ్లను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదని..
చాలామంది గోధుమపిండి ఉపయోగిస్తారు. అలాగే ఈ మధ్య రాగి పిండిని కూడా వాడుతున్నారు. గోధుమపిండి, రాగి పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో అనేక పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ రెండు ఆరోగ్యానికి మంచిదే అయినా... ఏది తినాలో అన్నా కన్ఫ్యూజన్ కచ్చితంగా ఉంటుంది. చాలామంది గోధుమ పిండి మంచిది అంటే... మరి కొంత మంది రాగి పిండి అని అంటారు. ఇంతకీ ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పిండిలో ఫైబర్, ఐరన్, విటమిన్లు, అమైనో యాసిడ్స్, క్యాల్షియం, రాగి వంటివి లభిస్తాయి. బియ్యంతో కలిపి రాగి తినొచ్చు. వివిధ రకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. డయాబెటిస్ కంట్రోల్ కు, బిపి నియంత్రణకు, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో రాగి పిండి ఎంతో చక్కగా పనిచేస్తుంది. గాయాలను త్వరగా నయం చేయటంలో కూడా రాగి పిండి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు రాగి పిండి తినకపోవడం మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది. కాబట్టి తక్కువగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: