అటు అల్లు అర్జున్ ఇటు మోహన్ బాబు కు.. ఈ వారమే ఎంతో కీలకం..!

Amruth kumar
ఒకేసారి టాలీవుడ్ లో రెండు వివాదాలు రెండు కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి .. మోహన్ బాబు మీడియా పై దాడి చేసిన కేసు ప్రభావం టాలీవుడ్ పై తక్కువగా ఉన్న .. కానీ అల్లు అర్జున్ కేసు ప్రభావం మాత్రం గట్టిగా చూపిస్తుంది .. ముఖ్యంగా మొత్తంగా బెనిఫిట్ షోలే ర‌ద్దయ్యే ప్రమాదం  ఏర్పడింది .. ఈ సంగతి ఇలా ఉంచితే .. ఇటు అల్లు అర్జున్ కేసు అయినా.. అటు మోహన్ బాబు కేసుకైనా ఈ వారమే ఎంతో కీలకంగా మారనుంది. ముందుగా మోహన్ బాబు కేసు విషయానికి వస్తే .. మీడియా ప్రతినిధి పై దాడి చేసిన ఘటనలో ఆయనపై క్రిమినల్ కేసు ఆయన ఎదుర్కొంటున్నారు .. ఆయనపై పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో అత్యాయత్నం కేసు నమోదు కాగా.. ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు .. ఇక దీనిపై హైకోర్టులో విచారణ పూర్తయింది .. తుదితిర్పును రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం.

ఇక మోహన్ బాబుకు ముందస్తు బెయిల్‌ వస్తుందా రాదా అనే అనుమానం అందరిలో ఉంది .. ఆయనకు బెయిల్‌ వస్తే ఓకే రాకపోతే మాత్రం అరెస్ట్ అవటం ఖాయం.. అరెస్టు అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది .. ఇదే సమయంలో ఆయన ఇప్పుడు పరారైనట్టు వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు పరారీపై గతంలో పుకార్లు వచ్చాయి .. వాటిని ఆయన స్వయంగా ఖండించారు .. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన పరారీపై రూమర్లు బయటికి వచ్చాయి .. అలాగే మోహన్ బాబు దుబాయ్ వెళ్లిపోయారని కూడా కొందరు అంటున్నారు. ఇక దీనిపై స్పందించి ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆయన లాయర్ మాత్రం మోహ‌న్ బాబు ఇక్కడే ఉన్నారని కోర్టుకు చెప్పారు. మోహన్ బాబు స్థానికంగా ఉన్నారని అఫిడ‌విట్‌ ను సమర్పించాలని కోర్టు లాయర్ ను ఆదేశించింది. అది ఇచ్చిన తర్వాతే తుది తీర్పు రానుంది.

ఇటు అల్లు అర్జున్ కూడా ఇదే కీలకమైన వారం.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు అవ్వగా అందులో ఏ 11 నిందితుడిగా ఉన్నాడు అల్లు అర్జున్ .. ఇప్పటికే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అదే టైంలో హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్ గ‌డువు ముగియడానికి కొన్ని రోజుల సమయం ఉంది .. అయితే ఈ బెయిల్ పై ఈ వారంలోనే తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది .. ఈ కేసు పై  సీఎం రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ గా ఉన్నారనే విషయం నిన్నటి అసెంబ్లీ సమావేశాలతో పోలీసులకు స్పష్టంగా అర్థమైంది. ఇక దీంతో బన్నీ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈ వారం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ వెంటనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేస్తారు. అప్పుడు అల్లు అర్జున్ మళ్లీ రెగ్యులర్ యెయిల్‌ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇటు మోహన్ బాబుకు అటు అల్లు అర్జున్ కు ఈ వారం ఎంతో కీలకంగా మారనుంది. వీరిద్దరి కేసులు ఈ వారం కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: