కొత్త-పాత మోడల్ వాటర్ హీటర్లకు తేడాలివే.. ఇది కొంటె ప్రాణానికే ప్రమాదం?

lakhmi saranya
శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా వేడి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. చలి ఎక్కువగా ఉండటం వల్ల వేడి నీళ్లను చేస్తారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో అయితే తప్పకుండా హీటర్ ఉండాల్సిందే. చల్లని వాతావరణానికి నార్మల్ వాటర్ తో స్నానం చేయాలంటే జనాలు వనికిపోతుంటారు. కాగా కొంతమంది హీటర్ వాడుతుంటారు. కానీ ఈ హీటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏ రకం హీటర్ వాడితే సేఫ్ మరి... అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా మార్కెట్లో చాలా రకాల హీటర్లు ఉంటాయి. కాగా అందరూ వారికి నచ్చినవి కొంటుంటారు. అయితే కొన్ని ఆటోమేటిక్ సిస్టమ్ హీటర్లు అమ్ముతారు. వాటర్ వేడి అయ్యాక... దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. మనం ఆఫ్ చేయాల్సిన పని ఉండదు. మరికొన్నిటికి ఆటోమెటిక్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉండదు. ఈ పాత మోడల్ హీటర్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హీటర్ వద్దకు చిన్న పిల్లల్ని వెళ్ళనివ్వకూడదు. అంతేకాకుండా బకెట్లో వాటర్ కొలత సరిగ్గా చూసుకుని పొయ్యాలి. కొలతను మించి మునగకుండా హీటర్ను చూసుకోవాలి.
లేకపోతే షాక్ కొడుతుంది. అలాగే కరెంట్ ప్రాబ్లం ఉన్న ... ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాగా దాదాపు కొత్త మోడల్ ఆటోమేటిక్ ఆఫ్ అయ్యే హీటర్ ఎంపిక చేసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే కొత్త మోడల్ హీటర్లు కొనాలనుకుంటే ఐఏస్ఐ ఉన్నది కొనుగోలు చేస్తే బెటర్. అలాగే కొనేముందు ఓసారి స్టార్ రేటింగ్ కూడా చెక్ చేస్తే మేలు. అయితే తక్కువ రేట్ అని పాత మోడల్ హీటర్లు కొనకుండా స్టార్ రేటింగ్, ఐఏస్ఐ మార్క్ ఉన్న హీటర్లు కొంటే సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యత లేని హీటర్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: