టాలీవుడ్ లోనే వివాదాలు లేని .. ఆ స్టార్ హీరోలు వేరే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో పదుల సంఖ్యలో స్టార్ హీరోలు ఉన్నారు.. ఇక వారిలో కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే వివాదాలకు దూరంగా ఉన్నారు.. ఇంతకి ఆ హీరోలు ఎవరు అంటే.. మహేష్ బాబు , ప్రభాస్, వెంకటేష్ .. ఈ ముగ్గురు హీరోలకు క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సక్సెస్ రేట్ అంతకందుకు పెరుగుతూ వెళ్తుంది. దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తొక్క వే .. ఆయన సినిమాలు ఎంత కూల్ గా ఉంటాయో ఆయన కూడా అంతే కూల్ గా కనిపిస్తూ ఉంటారు. అలాగే చిత్ర పరిశ్రమలో అందరితో కలిసిపోతారు. నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా వెంకటేష్ కెరియర్ కొనసాగిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల ఆయన కెరియర్లో వెంకటేష్ ఎప్పుడూ వివాదాలు దూరంగా ఉంటూ ఉన్నారు. ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఈ సీనియర్ హీరో ఇతరులను నొప్పించేలా ఎన్నడు కామెంట్లు చేయడానికి అసలు ఇష్టపడరు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో సంక్రాంతికి వస్తున్నామం సినిమాతో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతు ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజులు ఈ హీరో కెరియర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.. ప్రభాస్ కూడా ఎప్పుడు ఇతరులను నొప్పించడానికి అసలు ఇష్టపడరు.. గత పది సంవత్సరాలుగా ప్రభాస్ టాలీవుడ్ లోనే వివాదరహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తర్వారలోనే ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు.. ఒక్కొ సినిమాతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ తండ్రిని మించిన తనయుడుగా టాలీవుడ్ లోనే సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో మహేష్ కు ఒక వివాదం కూడా లేదు .. అందరితో సాన్నిత్యంగా ఉంటూ తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ , రాజమౌళితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సినిమాలతో పాటుగా వివాదాలకు దూరంగా ఉంటున్నారు.. అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా పెరిగింది.