సోషల్ మీడియా పై మీ ఆసక్తి వ్యాపారంగా ఎలా మారుతోందంటే...!

lakhmi saranya
ఈరోజుల్లో పెద్దవాళ్ల వరకు కూడా ఫోన్ యూజెస్ మరింతగా పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా .. ప్రస్తుతం పవర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వటానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి సరైన వేదిక కూడాను. ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్, రెడిట్ ఇలా... ఏదో ఒక సోషల్ మీడియా ఎకౌంట్ లేనివారంటూ ఈ కాలంలో ఎవరు ఉండటం లేదు. అయితే ప్రజల్లో ఉన్న ఇలాంటి ఆసక్తే ఇతరులకు వ్యాపారంగా మారుతుంది అంటున్నారు నిపుణులు.
మనం చేసే లైకులు, షేరింగ్ లు ఇన్ ప్ణుయెన్సర్లను ప్రమోట్ చేయడంలో, పరోక్షంగా వారు ఆర్థికంగా బలపడటంలో సహాయపడుతూన్నాయి. కాగా ప్రస్తుతం మరో నయా ట్రెండ్ ముందుకు వచ్చింది. అదే గెట్ యువర్ ఫ్లెక్స్ ఇది సోషల్ మీడియా పై ఆసక్తి ఉన్నవారిని ఎలా ఆకట్టుకుంటుందో ఇప్పుడు చూద్దాం. గెట్ యువర్ ఫ్లెక్స్ ఒక నయా ట్రెండ్. ఇది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ డ్రైవింగ్ బిహేవియర్ కలిగిన వ్యక్తులకు ప్రత్యేకమైన సేవలు అందించేందుకు ఉద్భవించిన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్.
అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా కనిపిస్తూ ఫేమస్ ఎత్తులుగా చలామణి అవ్వాలని కోరికగల వ్యక్తులకు సస్విస్ అందిస్తుంది. ఇండ్లల్లోనే ఖాళీగా ఉంటున్నవారు, సమయం లేక సోషల్ మీడియాలో తమ గురించి స్టోరీలను క్రియేట్ చేసి పోస్ట్ చేయలేనివారు చాలామంది ఉంటారు. అలాంటివారు గ్రేట్ యువర్ ఫ్లెక్స్ ఆన్ లైన్ వేదికను సంప్రదిస్తే కొద్ది మొత్తంలో డబ్బులు తీసుకుని వారి తరుపున జనాదరణ పొందిన ఈవెంట్స్ సహా పలు ఇతర వేదికల్లో వీరు పార్టిసిపెంట్ అయినట్లు ఫేక్ చేయటంలో దాని నిర్వాహకులు సహాయపడుతున్నారు. అది దిల్జిత్ దోసాంజ్ కచేరి కావచ్చు లేదా అత్యంత ప్రముఖ్యత కలిగిన కేఫ్ కావచ్చు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వటానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి సరైన వేదిక కూడాను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: