తెలంగాణ: మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి.!

FARMANULLA SHAIK
పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీలో కూడా నేడు ఈ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని ఇకపై తెలంగాణాలో తాను సీఎంగా ఉన్నంతవరకు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదు అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో టాలీవుడ్ షాక్ లో ఉండిపోయింది.తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాస్పిటల్ కు వెళ్లి వైద్యం పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల చెక్కును ఆ బాలుడి తండ్రికి అందించారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై తెలంగాణలో నో బెన్ఫిట్ షో, నథింగ్. సినిమా హీరోలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. 

పోలీసు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి వెళ్లొద్దు. బయట ఈవెంట్స్, షోలు చేయడానికి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగొద్దు. ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ అవ్వొద్దు. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం. అందరు హీరోలు, నిర్మాతలు సహకరించాలి అని అన్నారు. దీంతో హీరోలకు మరో షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.అలాగే చిరంజీవి పై కూడా సంచలన  వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి అసలు ఆయన ఎమన్నారంటే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ ను చిరంజీవి పరామర్శించి ఉండాల్సిందని,మంత్రి కోమటిరెడ్డి అన్నారు. చిరంజీవి అంటే నాకు ఇష్టం. ఆయన ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించి, మరణించిన రేవతి భర్తకు ధైర్యం చెప్పాల్సింది. అల్లు అర్జున్ కు ఎలాంటి గాయాలు కాకుండా ఇండస్ట్రీలో చాలామంది ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబానికి బాసటగా ఉంటే వారికి మంచి పేరు వచ్చేది అని తెలిపారు.ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు  టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: