క్యాబేజీ 65 ఇలా చెయండి.. అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు..!
ఈ క్యాబేజీ 65 ని ఇంట్లో కూడా ఈజీ గానే తయారు చేసుకోవచ్చు. మరి ఈ క్యాబేజీ 65 కి కావాల్సిన పదార్ధాలు ఏంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇందులోనే కారం, ఉప్పు, పచ్చిమిర్చి సాస్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కగానే క్యాబేజీ విశ్రమాన్ని చిన్న ముద్దలుగా వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసి టిష్యూ పేపర్ లోకి తీసుకోవాలి. అంతే క్యాబేజీ 65 సిద్ధం. క్యాబేజీ 65 ఇలా కూడా తినవచ్చు. లేదంటే దీన్ని కోటింగ్ ఇచ్చి కూడా తినవచ్చు.
అందుకోసం ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులో పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉంటే క్యాప్సికమ్ మొక్కలు కూడా వేసి ఓసారి వేయించండి. ఆ తర్వాత ఇందులోనే టమాటా కెచప్, కొద్దిగా సోయాసాస్ వేసి అంతా మిక్స్ చేసిన తర్వాత వేయించిన క్యాబేజీ కూడా వేసి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా కూడా తినవచ్చు. ఈ టేస్టీ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా తినండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది.