గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చక్కటి చిట్కా..!

lakhmi saranya
చాలామంది గురక ఎక్కువగా పెడుతూ ఉంటారు. గురకను నియంతరించడానికి చక్కటి చిట్కాలు ఉన్నాయి. గురక అనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య. గురకతో ఇతరులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. గురక ఉన్నవారు పడుకున్న చోట ఇతరులకు పడుకుంటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. అయితే చిన్నప్పటి చిట్కాలతో ఈ కొరకను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. గురక అనేది దాదాపు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే సాధారణ నిద్ర సమస్య. గురక ప్రమాదకరమైన సమస్య కానప్పటికీ, దగ్గరగా నిద్రపోయే వారికి గురక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
నిద్రపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకునే శబ్దమే గురక. శబ్దం స్థాయి ఎత్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. మరి కొందరు చాలా బిగ్గరగా గురక పెట్టడం వల్ల సమీపంలో నిద్రిస్తున్న వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గురక అనేది నిద్రలో నోరు, ముక్కు ద్వారా శ్వాసను అడ్డుకోవటం వల్ల గొంతులోని కణజాలాలలో కంపనం. మద్యపానం చేసేవారు, నిద్రపోయే స్థానం, ముక్కు మూసుకుపోవటం వల్ల గురక వస్తుంది. గురకను అనేక విధాలుగా నివారించవచ్చు. కేవలం ఆహారం ద్వారా కూడా దీనిని నివారించవచ్చు. గురకను తగ్గించడంలో ఔషధ తేనె చాలా సహాయపడుతుంది.
కురకతో బాధపడేవారు రాత్రిపూట ఒక చెంచా తేనె తీసుకుంటే గాఢమైన, ప్రశాంతమైన నిద్రను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు, ఆంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇది కురకను నియంతరించడంలో సహాయపడుతుంది. అలాగే, తేనెను గొంతుకు పూయడం వల్ల శబ్దాలను ఉత్పత్తి చేసే శ్లేష్మం ప్రశాంతంగా ఉంటుంది. ఇది గురక శబ్దాన్ని తగ్గిస్తుంది. నిద్రవేళకు ముందు ఒక చెంచా తేనెను తీసుకుంటే శ్వాసనాళాల్లో రద్దీ, గొంతువాపు తగ్గుతుంది. దీన్ని ఒక చెంచా సింపుల్ గా తీసుకోవచ్చు. లేదా ఒక కప్పు వేసి నీటిలో అల్లం, తేనే కలిపి తాగండి. బరువు తగ్గటం ద్వారా గురకను నియంత్రించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: