చనిపోయిందని చెప్పినా సినిమా చూశాకే వెళ్తానన్నాడు.. ఏసీపీ సంచలన వ్యాఖ్యలు!

Reddy P Rajasekhar
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో భాగంగా వెల్లడించిన విషయాలలో వాస్తవాలు లేవని పోలీసుల కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. సీఐ రాజు నాయక్ మాట్లాడుతూ అన్నీ సంధ్య థియేటర్ కు రావడానికి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యం అనుమతులు కోరడం మాత్రం వాస్తవమేనని చెప్పుకొచ్చారు.
 
ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉండటం వల్ల హీరో వస్తే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పామని సీఐ రాజు నాయక్ వెల్లడించారు. యాజమాన్యం ఈ విషయాన్ని హీరోకు చెప్పిందో లేదో మాత్రం తమకు తెలియదని సీఐ అన్నారు. రేవతిని బ్రతికించడానికి చాలా ప్రయత్నించామని తొక్కిసలాటలో తాను కూడా చనిపోతానని అనుకున్నానని సీఐ అన్నారు. ఏసీపీ రమేశ్ మాట్లాడుతూ ఒక లేడీ చనిపోయిందని పిల్లాడు గాయపడ్డాడని బన్నీ మేనేజర్ కు చెప్పామని తెలిపారు.
 
బన్నీ మేనేజర్ మమ్మల్ని బన్నీతో మాట్లాడనివ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. కొంత సమయానికి నేను వెళ్లి బన్నీకి ఈ విషయం చెబితే సినిమా చూశాకే తాను వెళ్తానని బన్నీ చెప్పాడని ఏసీపీ రమేశ్ కామెంట్లు చేశారు. బన్నీకి 10 నుంచి 15 నిమిషాల టైమ్ ఇచ్చామని ఆ తర్వాత డీసీపీతో కలిసి హీరోను బయటకు తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.
 
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మనిషి చనిపోయిన తర్వాత ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి? అని అన్నారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఓయూ జేఏసీ నాయకులు పూల కుండీలను ధ్వంసం చేయడంతో పాటు ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్వరని సమాచారం అందుతోంది. జరుగుతున్న ఘటనల గురించి బన్నీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: