జనసేన: చిక్కుల్లో ఎంపీ అభ్యర్థి..!

Divya
కాకినాడ లోక్ సభ ఎన్నికలు చాలా రసవత్తంగా మారుతున్నాయి.. ఎన్నికలలో గెలుపు కోసం ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం కానీ ఇప్పుడు తాజాగా కాకినాడ లోక్సభ ఎన్నికలలో మరింత వేడి రాజుకుంది.. కూటమి తరపున జనసేన అభ్యర్థి కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ నిలబడ్డారు. అయితే ఆయన చదువుతోపాటు విదేశాలలో ఆయన పైన నమోదైన కేసులు అంశం ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది. తంగెల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు తన గురించి తాను చెప్పుకున్న ఆర్భాట ప్రచారం ఇప్పుడు ఆయనకి శాపంగా మారుతున్నది.

తంగెళ్ళ శ్రీనివాస్ ఇటీవలే నామినేషన్ ని కూడా దాఖలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు అతను ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు.. అయితే ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా ఉద్యోగం చేశానని వాటికి రాజీనామా చేసి దుబాయిలో వ్యాపారం చేశారని ప్రచారం కూడా సాగింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల అఫీడబిట్ లో తన విద్య అర్హత ఇంటర్ అని తెలిసి అందరూ షాక్ అయ్యారు.. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.. తన విద్యా అర్హత ఇంటారని పేర్కొనడంతో ఇంటర్ చదివిన వ్యక్తికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా అనే ప్రశ్నను వైసీపీ నేతలు వైరల్ గా చేస్తున్నారు.

ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశాలలో కేవలం పెట్రోల్ బంకుల్లో పని తప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగం కోట్లల్లో వ్యాపారం ఎలా సాధించారు అన్నట్లుగా లోతుగా చర్చ కొనసాగుతోంది. దీంతో ఒక్కొక్కటిగా ఆయన నేర చరిత్ర వెలుగులోకి వస్తోంది.. తంగెళ్ల శ్రీనివాస్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. బాగా ఎదిగారని పేరు రావడంతో లోక్సభ అభ్యర్థి టికెట్ ని దక్కించుకునేలా చేసుకున్నారు. దీంతో జనసేన పార్టీ నుంచి ఆయనకు ఎంపీ టికెట్ కూడా రావడం జరిగింది. ఇటీవలే ఆయన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి దుబాయిలో ఇతను సాఫ్ట్వేర్ ఉద్యోగి కాదని క్రికెట్ బుకీ నిర్వహించే వారిని అక్కడ బ్యాంకులలో లోన్లు తీసుకొని ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2015 మార్చిలో తన పైన కేసు నమోదు చేసినట్టుగా కూడా సమాచారం. అతనికి ఈ కేసు కు సంబంధించి నోటీసు కూడా వచ్చినట్లు పలు రకాల ఆధారాలు వెలబడుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు అక్కడ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు జనసేన నేతలు కంగుతినే పని అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: