లోకేష్ కి ఇంకా భయం తగ్గలేదా... అందుకే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడా..?

Pulgam Srinivas
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు అయినటువంటి నారా లోకేష్ పోయిన సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుండి పోటీలోకి దిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన టీడీపీ పార్టీలో అత్యంత ముఖ్యమైన నేత కావడంతో ఈయన అవలీలగా ఈ ప్రాంతం నుండి గెలుపొందుతాడు అని చాలా మంది అనుకున్నారు.

ఈయన పోయినసారి ఎన్నికలలో 2014 వ సంవత్సరంలో మంగళగిరిలో గెలిచి సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తో పోటీపడ్డాడు. ఇకపోతే రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2014 లో గెలుపొందాడు. ఇక 2019 వ సంవత్సరం కూడా ఈయన వైసీపీ నుండి సీట్ ను దక్కించుకొని బరిలో నిలిచాడు. ఇకపోతే రామకృష్ణారెడ్డి లోకల్ వ్యక్తి కావడం, ఆ సమయంలో వైసీపీ గాలి భారీగా బీచడంతో టీడీపీ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు అయినటువంటి నారా లోకేష్ ను రామకృష్ణారెడ్డి అవలీలగా ఓడించాడు.

ఇక ఈ ఓటమి తర్వాత ఈయన మంగళగిరి వైపు తిరిగి చూడడు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. ఎన్నికల తర్వాత కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాడు. ఇక రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఈయన మంగళగిరి నుండి బరిలో నిలిచాడు. ఇకపోతే 2014, 2019 సంవత్సరంలో మంగళగిరి నుండి గెలుపొందిన రామకృష్ణారెడ్డి కి కాకుండా ఈ సారి ఈ ప్రాంత టికెట్ ను వైసీపీ పార్టీ మురుగుడు లావణ్య కు ఇచ్చింది.

ఇక పోయినసారి ఎలక్షన్ లలో ఓడిపోవడంతో లోకేష్ ఈ సారి కచ్చితంగా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నాడు. దానితో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న దాదాపు అన్ని గ్రామాలను కవర్ చేస్తూ ఎన్నో సభలను నిర్వహించాడు. మరి ఈసారైనా లోకేష్ గెలుస్తాడా..? లేక వైసీపీ దెబ్బకు మరో ఓటమిని అందుకుంటాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: