జగన్ : నేడు పులివెందులకి పోనున్న పులిబిడ్డ..!

FARMANULLA SHAIK
ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం లో భాగంగా  రాష్ట్రం లోని ప్రజలందరూ వారి వారి సొంత ఊర్లకు పయన బాట పట్టారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఓటు వేయడానికి సొంత ఊళ్ళకి బయలుదేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆయన సతీమణి భారతి గారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సొంత ఊరైన కడప జిల్లాలోని పులివెందులకి బయలుదేరి రేపు ఓటు హక్కు వినియోగించుకోమన్నారు.గత రెండు నెలలుగా ప్రజల మధ్య ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ నిన్న సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని ప్రచారం తో ముగింపు పలికారు. ఇవాళ తాడేపల్లి నుంచి తన సొంత నియోజకవర్గమైనా పులివెందులకు వెళ్లి రాత్రికి అక్కడే తన సొంత ఇంట్లో బస చేయనున్నారు.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు వైసీపీ పార్టీ నాయకులు, పోలీసులు. ఒకవైపు పోలింగ్ ఇంకోవైపు సీఎం వస్తుండటం తో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ.జగన్ రెండో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్న జగన్ ఎన్నికల ప్రచారానికి సమయం పూర్తి కావడం తో ఆయన పులివెందులకు చేరుకుని కొంత విశ్రాంతి తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు తిరిగి తాడేపల్లి కి చేరుకుంటారు. రేపు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య పులివెందులలోని భాకరాపురంలోని జయమ్మ కాలనీ లో అంగన్వాడి రెండో సెంటర్లో 138 బూత్ నెంబర్ లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం జగన్ ఫ్యామిలీ అనంతరం 10 గంటలకు గన్నవరం బయలుదేరి వెళ్ళనున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున పోలింగ్కి ముందు సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతాలకు చెందిన వారు ఉండేందుకు ఛాన్స్ లేదు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: