మట్టి గణపతి విగ్రహాలను షేర్ చేసిన ముస్లిం వ్యక్తి.. ఎక్కడో తెలిస్తే..
అత్యంత రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు మీద ఆయన హిందూ దేవుళ్ళ పట్ల చాలా గౌరవం చూపించారు. ఈరోజు వినాయక చవితి అనే సంగతి తెలిసిందే. అందువల్ల హిందువులందరూ బయటకు వచ్చి పూజల సామగ్రి కొనే హడావుడిలో పడిపోయారు. మరికొందరు రోజువారి పనులకు వెళ్తూ బిజీగా ఉన్నారు. అలాంటి రోడ్డు మీదకు ఒక ముస్లిం వ్యక్తి తలపై టోపీ, కుర్తా పైజామా వేసుకుని ఒక వెహికల్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతడు చేసిన పనికి అందరూ ఆయన దగ్గర క్యూకట్టారు.. షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందించారు. ప్లేస్ కూడా చేశారు ఎందుకంటే అతడు తన వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ఉన్నాడు.
సాధారణంగా ఇలా హిందూ దేవుడి విగ్రహాలను ముస్లింలు పంపిణీ చేయారని అందరూ అనుకుంటారు కానీ మహ్మద్ ఇషాక్ అనే వ్యక్తి ఆ భావన తప్పు అని నిరూపించాడు. అక్కయ్యపాలెంలోని చిన్నూరు చెందిన ఇషాక్ ఇవాళ శుక్రవారం కావడంతో ముందుగా నమాజ్ చేసుకున్నాడు. అనంతరం ఓ టెంపోను డ్రైవ్ చేసుకుని బిజీ రెడ్ మీదకి వచ్చి వినాయక విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రారంభించాడు. అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ సెంటర్ వద్ద అతను ఈ మట్టి విగ్రహాల ప్రతిమలను పంపిణీ చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వెయ్యి విగ్రహాలను తీసుకొచ్చి హిందువులందరికీ అందజేశాడు. అంతేకాదు హ్యాపీ వినాయక చవితి అంటూ ఆప్యాయంగా విష్ చేశాడు. "మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం" అంటూ అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చాడు.
ముస్లిం వ్యక్తి అయి ఉండి కూడా హిందువులకు వినాయకుడి మట్టి విగ్రహాలను పంపిణీ చేసి అందరి అభినందనలు అందుకున్నాడు. కొంతమంది అతనితో సెల్ఫీలు తీసుకున్నారు పిల్లలు పెద్దలు మహిళలు అందరూ అతడిని శభాష్ సోదరా అంటూ ప్రశంసించారు. వీడియో గురించి తెలుసుకునే ఇతరులు ఇది కదా అసలైన మత సామరస్యం అంటే అని కామెంట్లు పెడుతున్నారు.