రేవంత్‌రెడ్డి ఆ చిన్న పని చేస్తే.. ఇక మెట్రో 2.0 పరుగులే?
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిపిన చర్చల్లో రెండో దశకు ఇప్పటికే సాధక బాధకాలు పరిశీలించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ లేఖ రాష్ట్రంలో మెట్రో విస్తరణపై కొత్త ఆశలు రేపింది.మెట్రో రెండో దశ అమలుకు కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించినట్లు ఖట్టర్ సూచించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దశకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీలో రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులను వెంటనే ప్రతిపాదించాలని ముఖ్యమంత్రికి సూచనలు చేశారు. మొదటి దశ టేకోవర్ పూర్తయిన తర్వాత రెండో దశ ప్రతిపాదనలను కేంద్రానికి త్వరగా పంపాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ చర్యలు పూర్తి అయితే మెట్రో విస్తరణ పనులు వేగంగా మొదలవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ నగర రద్దీని తగ్గించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలకమైనది.మెట్రో రెండో దశలో లక్డిపుల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మార్గం ఉంటుందని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అలాగే నగరంలోని ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు కూడా మెట్రో సర్వీస్ విస్తరించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. టేకోవర్ ప్రక్రియలో ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించి వేగంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్పందించే అవకాశం ఉంది. మెట్రో విస్తరణ హైదరాబాద్ నగర అభివృద్ధికి కీలకమైన దశగా భావిస్తున్నారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.