యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని భావిస్తున్నారు.ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అన్ని లక్షణాలు దేవర మూవీకి ఉన్నాయి. దేవర సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు వ్యూస్ పరంగా అదుర్స్ అనిపించాయి.దేవర సినిమా నుంచి తాజాగా వినాయక చవితి కానుకగా కొత్త పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 350 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. దేవర సినిమా జాన్వీ, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివ ఇలా ఎంతోమంది కెరీర్లను సైతం డిసైడ్ చేయనుంది.ఈ మధ్య కాలంలో టీజర్ లేకుండా డైరెక్ట్ గా ట్రైలర్ విడుదలవుతున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. జాన్వీ కపూర్ఈ సినిమాలో తన గ్లామర్ తో అదరగొట్టిందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో.. ఇక దేవరసినిమా విడుదలకు ఇంకో మూడు వారాలే సమయం ఉంది. సెప్టెంబరు 27న 'దేవర' విడుదల కానున్న సంగతితెలిసిందే.
ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.సోలో హీరోగా తారక్ చివరి సినిమా 'అరవింద సమేత'కు ఉన్న హైప్, దానికి జరిగిన బిజినెస్, అది సాధించిన వసూళ్లకు.. 'దేవర'ఖు అసలు పోలికే ఉండబోదనడంలో సందేహం లేదు. ఎందుకంటే పాన్ వరల్డ్ హిట్ 'దేవర' తర్వాత తారక్ నుంచి వస్తున్న చిత్రమిది. దీనిపై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో యుఎస్ ప్రి సేల్స్‌కు వస్తున్న స్పందనను బట్టే అర్థం చేసుకోవచ్చు.విడుదలకు నెల రోజుల ముందే 'దేవర' యుఎస్ ప్రిమియర్స్ టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. ఆరంభం నుంచే జోరుగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఆల్రెడీ అక్కడ 15 వేల టికెట్లు సేల్ అయిపోవడం విశేషం. విడుదలకు మూడు వారాల ముందే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడైన ఇండియన్ సినిమాలు అరుదు. అప్పుడే ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును కూడా టచ్ చేసేసింది.చూస్తుంటే ప్రి సేల్స్‌తోనే సినిమా మిలియన్ మార్కును కూడా అందుకునేలా ఉంది. దీన్ని బట్టే సినిమాకు హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. యుఎస్ నంబర్స్ అనూహ్యమైన స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఇండియాలో కూడా 'దేవర'కు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల చివరి వారం 'దేవర' ఊపుతో ఊగిపోవడం గ్యారెంటీ.… మరి సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర ఏం చేస్తుందో చూడాలి.