హైడ్రా: మురళీమోహన్ కు షాక్..నెక్స్ట్ మీరేనంటూ నోటీసులు జారీ ..!

FARMANULLA SHAIK
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతం అయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితం అయిన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.మొత్తం మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా సెంట్రల్‌ జోన్‌గా హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌, నార్త్‌ జోన్‌గా సైబరాబాద్‌, సౌత్‌ జోన్‌గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్‌ అధికారులు, పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ మూడు జోన్లను చీఫ్‌ కమిషనర్‌ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రెండు నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో నే దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. దీంతో హైడ్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి. హైడ్రా ఇలానే ముందుకెళ్తే హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడుకొవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా హైడ్రా సిని నటుడు, నిర్మాత, మురళి మోహన్ కు చెందిన జయభేరి షాకిచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు. నోటీసులపై జయభేరీ సంస్థ ఇంకా స్పందించలేదు. అయితే చాలా మంది అక్రమార్కులు చెరువులు కుంటలు కబ్జా చేశారు.ఆ తర్వాత జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులుక లంచాలు ఇచ్చి నిర్మాణాలకు అనుమతి తీసుకున్నారు. నిర్మాలు చేపట్టారు. ఇప్పుడు వారికి నోటీసులు ఇస్తే కోర్టు వెళ్తున్నారు. తమకు అధికారులే ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని కోర్టుకు చెబుతున్నారు. అయితే లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చిన అధికారులు అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుంది. అధికారుల తీరు వల్లే చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: