బ్లాక్ బస్టర్ అని తెలిసిన తన ఇమేజ్ వల్ల చిరంజీవి వదిలేసిన సినిమా ఏదో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు . చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమై న విజయవంతమైన సినిమాలలో నటించాడు . అలాగే ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో కూడా నటించాడు . అలా ఎన్నో అద్భుతమైన సినిమాల లో నటించిన చిరంజీవి ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఇకపోతే చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు . ఇక కొన్ని సినిమాలను కథ నచ్చక వదిలి పెడితే , మరికొన్ని సినిమాలు విజయాలను సాధిస్తాయి అని తెలిసిన తనపై అస్సలు వర్కౌట్ కావు అనే ఉద్దేశంతో వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలా చిరంజీవి వదిలేసిన ఓ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని కూడా సాధించింది. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ హీరో గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మన్యంలో మొనగాడు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కథ పూర్తి అయిన తర్వాత మొదటగా దీనిని కోడి రామకృష్ణ , చిరంజీవి గారికి వినిపించాడట. కథ మొత్తం విన్న చిరంజీవి సినిమా కథ అద్భుతంగా ఉంది.

మూవీ మంచి విజయం సాధించే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ నా ఈమేజ్ కి ఇప్పుడు ఈ సినిమా తీస్తే ప్రేక్షకులు దానిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. నువ్వు వేరే హీరోతోనైనా ముందుకు వెళ్ళు సినిమా మంచి విజయం సాధిస్తుంది అని కోడి రామకృష్ణ కు చెప్పాడట. ఆయన దానితో అర్జున్ ను సంప్రదించి ఈ సినిమాను రూపొందించగా ఆ సినిమా మంచి విజయం సాధించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: