అల్లు అర్జున్ కి పుష్ప 2 మూవీ అటు ఖేదం ఇటు మోదం మిగిల్చింది. పుష్ప 2 ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టినందుకు ఆనందపడాలో మహిళ మరణంతో ఎదురవుతున్న విమర్శలు, ఆరోపణలకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలలో దుమారం రేగింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సందర్భంగా అల్లు అర్జున్ పైన వ్యక్తమైన సానుభూతి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తుడిచిపెట్టుకుపోయింది.అయితే ఈ మాటలపై అల్లు అర్జున్ నిన్న అనగా శనివారం ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ఎవరి పేరును బయటకు తీయలేదు. ఇది అనుకోకుండా జరిగింది. దీనిలో పరోక్షంగా నా తప్పు ఉంది అంటూ తెలిపారు. నామీద చాలా తప్పుడు ఆరోపణలు చేస్తూ నా క్యారెక్టర్ దిగజారుస్తున్నారు. నాకు పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మా మేనేజ్మెంట్ చెప్పడం వలన నేను థియేటర్ లో నుంచి వెళ్లిపోయాను అంటూ అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.ఇదిలావుండగా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై నిన్న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. థియేటర్కు వెళ్లిన కాసేపటికి పోలీసులు చెప్పడంతో తాను వెళ్లిపోయానని బన్నీ తెలిపారు. అయితే ఆయన ఇంటర్వెల్ వరకు ఉన్నారని, జాతర సీన్ కూడా చూశారని పలువురు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ, అల్లు అర్జున్ అరెస్టెడ్ ట్రెండ్ చేస్తున్నారు. అటు మహిళా చనిపోయిన విషయం ఆయనకు పోలీసులు చెప్పలేదని బన్నీ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.ఇకపోతే ఈ వివాదం ఎక్కడతో ముగిసిపోతుంది అని అనుకోవడానికి లేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఈ కేస్ ఆధారపడి ఉంటుంది. ముందు ముందు ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.