ఐడియా అదుర్స్.. అరటిపండ్ల వ్యాపారి వస్తుంటే కోతులన్నీ పరార్.. ఏం చేశాడంటే?

praveen
తెలంగాణలో కోతుల దెబ్బకి రైతులు విలవిలలాడిపోతున్నారు. పంటలని నాశనం చేస్తూ, ఇళ్లల్లోకి చొరబడి భయభ్రాంతుల్ని గురిచేస్తున్నాయి. అంతే కాదు రోడ్లమీద వెళ్లే ఆడవాళ్లని, పిల్లల్ని కూడా వదలట్లేదు. ఇటీవల నాగమణి అనే ఒక మహిళ వెంటపడి ఇవి దాడి చేయడంతో ఆమె బైక్ పైనుంచి కింద పడిపోయింది ఫలితంగా తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుత ఆసుపత్రిలో ఆమె చావుతో పోరాడుతోంది. ఇలా ఈ సమస్యలు మరింత పెరిగిపోతున్న నేపథ్యంలో జనం రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. కొందరు కొండముచ్చుల్ని తెస్తుంటే, ఇంకొందరు పులి బొమ్మలు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కానీ వరంగల్ జిల్లా కుర్రాడు దేవేందర్ వేసిన స్కెచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే!
దేవేందర్ నర్సంపేట నుంచి కొత్తగూడకి ఆటోలో అరటిపండ్లు అమ్మడానికి వెళ్తుంటాడు. అతని పండ్లను దొంగలించడానికి దారిలో కోతులదండు కాపుకాసి కూర్చుంటాయి. అరటిపండ్లు కనపడితే చాలు, గుంపులు గుంపులుగా వచ్చి లాక్కెళ్లిపోయేవి. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, దేవేందర్ తన బుర్రకు పదును పెట్టాడు. ఒక ఐడియా తట్టింది. వెంటనే తన ఆటోకి కుక్కలు మొరిగే సైరన్ పెట్టించాడు. అంతే సంగతులు! ఇప్పుడు ఆ సైరన్ వినపడితే చాలు, కోతులన్నీ తోకముడిచి పారిపోతున్నాయి.
దీంతో అతని అరటిపండ్ల బిజినెస్ సాఫీగా సాగుతోంది. రూపాయి నష్టం లేకుండా అతను ప్రశాంతంగా తన వ్యాపారం చేసుకోగలుగుతున్నాడు. కొత్తగూడలో కోతుల దాడులు ఎక్కువవడంతో, ఒక మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవేందర్ కనిపెట్టిన ఈ టెక్నిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. "ఐడియా అదుర్స్ భయ్యా, నువ్వు కనిపెట్టిన చిన్న టెక్నిక్ వల్ల ఇప్పుడు కోతులు పరారవుతుండడం చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తోంది" అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదువు రాని వారికి తెలివి లేదని ఎవరన్నారు? వారికే ఎక్కువ క్రియేటివిటీ తెలివి ప్రాబ్లం సాల్వ్ చేసే స్కిల్స్ ఉంటాయి! అని కొంతమంది కామెంట్లు పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: