విజయ్ కి అలాంటి రిప్లై ఇచ్చిన రష్మిక..బూతులు తిడుతున్న జనాలు..ఎందుకంటే..?
ఈ క్రమంలోనే, సోమవారం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్లో ‘రౌడీ జనార్ధన’ 2026లో విడుదల కాబోతుందంటూ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆయన“గాయపడిన వ్యక్తి జీవిత చరిత్ర” అనే క్యాప్షన్‌ను జత చేయడం అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ ఒక్క లైన్‌తోనే సినిమా కథపై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్ చేసిన ఈ పోస్ట్‌కు టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. విజయ్ను సపోర్ట్ చేస్తూ, ఆ పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ “లెట్స్ గో.. లెట్స్ గో.. లెట్స్ గో..” అంటూ లవ్, ఫైర్ ఎమోజీలను జత చేసి రిప్లై ఇచ్చారు. ఇది పూర్తిగా సినిమాపై ఉన్న ఉత్సాహాన్ని వ్యక్తపరిచిన సాధారణ స్పందన మాత్రమే.
అయితే, ఇక్కడ నుంచే అసలు సమస్య మొదలైంది. కొంతమంది నెటిజన్లు కావాలనే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. రష్మిక ఇచ్చిన సాధారణ రిప్లైని వక్రీకరిస్తూ, దానిలో లేనిపోని డబుల్ మీనింగ్ అర్థాలు తీయడం మొదలుపెట్టారు.“నీ ఓవర్ యాక్షన్ ఆపు”, “ఇంత హైప్ అవసరమా?” అంటూ రష్మికపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, బూతులతో దూషించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.వాస్తవానికి, ఒక హీరో పోస్ట్‌కు హీరోయిన్ స్పందించడం, సపోర్ట్ చేయడం అనేది ఇండస్ట్రీలో చాలా సాధారణమైన విషయం. అందులో తప్పు ఏమాత్రం లేదు. కానీ సోషల్ మీడియాలో కొందరు కావాలనే వ్యక్తిగత ద్వేషంతో, లేక వ్యూస్ కోసం ఇలాంటి విషయాలను అతిగా చేసి, సెలబ్రిటీలను మానసికంగా వేధిస్తున్నారు. ముఖ్యంగా రష్మిక విషయంలో ఇది కొత్త కాదు. ఆమె ఏ చిన్న విషయం చేసినా, దాన్ని ఓవర్ అనాలిసిస్ చేసి ట్రోల్ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది.
ఇలాంటి ట్రోలింగ్ వల్ల అసలు సినిమా మీద ఉండాల్సిన దృష్టి మళ్లిపోతోంది. ‘రౌడీ జనార్ధన’ లాంటి భారీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాల్సిన చోట, అర్థంలేని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా మొదలయ్యాయి.మొత్తానికి, విజయ్ దేవరకొండ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం, రష్మిక మందన్న సపోర్ట్ చేయడం రెండూ సహజమైన విషయాలే. వాటిని వక్రీకరించి, బూతులు తిడుతూ ట్రోల్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. సెలబ్రిటీలూ మనుషులే అన్న కనీస అవగాహనతో, సోషల్ మీడియాను బాధ్యతగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ‘రౌడీ జనార్ధన’ విషయానికి వస్తే, గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.