చేతులు జోడించి అడుగుతున్న క్షమించండి.. సింగర్ మంగ్లీ షాకింగ్ కామెంట్స్..!

Divya
ప్రముఖ ఫోక్ సింగర్ గా పేరు సంపాదించిన సింగర్ మంగ్లీ పాడిన ఒక హిందీ పాట వివాదాస్పదంగా మారడంతో సోషల్ మీడియా వేదికగా చాలామంది ఇమెను ట్రోల్ చేస్తున్నారు. కన్నడ యాక్షన్ సినిమా కేడి: ది డెవిల్ సినిమా కోసం పాడిన సర్కే చునార్ సర్కే పాటలు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నేటిజన్స్. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీ ఈ విషయం పైన బహిరంగ క్షమాపణలు కోరుతూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక నోట్ రాసుకొచ్చింది.



ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, ప్రజల మనోభావాలను గౌరవిస్తాను. అనుకోకుండా జరిగిన కొన్ని పొరపాట్లకు క్షమాపణలు కోరుతున్నాను ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తాను ఈ పాటను అన్ని సోషల్ మీడియా మ్యూజిక్ ఫ్లాట్ ఫార్ములా నుంచి తొలగిస్తున్నామని తన పోస్టులో తెలియజేసింది. ఇలా జరిగినందుకు చింతిస్తున్నానని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానంటూ తెలియజేసింది సింగర్ మంగ్లీ. వివాదానికి కారణమైన పాటలను సాహిత్యాన్ని ఇప్పటికే మార్చినట్లుగా తెలియజేసింది. అప్డేట్ చేసిన కొత్త వర్షన్ సాంగ్ ని త్వరలోనే విడుదల చేస్తామంటూ తెలియజేశారు.


కన్నడలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ధ్రువ సర్జ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే హిందీలో విడుదలైన లిరికల్ వీడియో పైన చాలా విమర్శలు రావడంతో ఈ విషయం పైన అటు చిత్ర బృందంతో పాటు సింగర్ మంగ్లీ కూడా క్షమాపణలు తెలియజేశారు. అయితే మిగిలిన భాషలో లేని అభ్యంతరాలు కేవలం హిందీ భాష లిరిక్స్ పైనే వినిపిస్తున్న ఈ పాటలోని కొన్ని పదాలు డబుల్ మీనింగ్ వచ్చేలా ఉండడంతో  అసభ్యత కనిపిస్తోందని ఉత్తరాది సినీ ప్రేక్షకుల సైతం ఫైర్ అవుతున్నారు. దీంతో తమ సినిమా ప్రతిష్టను దెబ్బతినకూడదని ఉద్దేశంతోనే ఈ పాటను సైతం డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మరి కొత్త వర్షన్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: