బిజినెస్ మ్యాన్ తో పెళ్లి పై.. క్లారిటీ ఇచ్చిన అనుష్క టీమ్..!
కానీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ అయినట్లుగా వినిపిస్తోంది. ఈ మేరకు అనుష్క పైన వస్తున్న పెళ్లి వార్తలను ఖండిస్తూ ఆమె టీమ్ ఒక నోట్ ని విడుదల చేసింది. ఒకరి జీవితాన్ని రోజువారి న్యూస్ గా మార్చేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అది నిజమా కాదా ?అని కూడా చూడడం లేదు. ఎవరికి వారు ఊహించడం, అంచనా వేయడం పదేపదే ప్రచురించడం వంటివి ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆమె వయసు పైన అనవసరమైన శ్రద్ధ చూపిస్తూ ప్రతి పోస్టులో 44 అనే నెంబర్ ని ఏదో ఒక వివాదాస్పదమైన అంశంగా హైలైట్ చేస్తున్నారు.
ఒకవేళ వయసు అంత పెద్ద సమస్య అయితే హీరోల విషయంలో కూడా అంతే ఉత్సాహం ఎందుకు చూపించడం లేదు? మహిళలకే ఎందుకు అంత భిన్నంగా చూపిస్తున్నారు అనుష్క శెట్టి కెరియర్ ని ప్రతిభ గౌరవంతో నిర్మించుకున్నారు , ఆమె ఎప్పుడూ కూడా పిఆర్ స్టంట్స్ పైన ఆధారపడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటుంది. అలాంటి మహిళలను టార్గెట్ చేసి ఇలా చేయడం అన్యాయం. ప్రతి ఒక్కరు తమ జీవితంలో జరిగేటువంటి విషయాలను అందరికీ చెప్పాలనుకోరు. వివాహం అనేది వ్యక్తిగత విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు , వ్యూస్ కోసం ఇలాంటివి సృష్టించాల్సిన అవసరం లేదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి, హీరోయిన్లను హీరోలతో సమానంగా గౌరవించండి అంటూ అనుష్క టీమ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.