క్రికెటర్ ఓవరాక్షన్‌కు ఐసీసీ కొరడా
ఈ క్రికెటర్ తొలుత పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో వాగ్వాదం, ఆ తర్వాత ఔటయ్యానన్న కోపంతో వికెట్లను కాలితో తన్నడంతో వెరసి క్లాసెన్‌కు ఐసీసీ జరిమానా విధించింది. మైదానంలో ఉన్న అంపైర్లు అలెక్స్ వార్ఫ్, లుబాబలో గకుమా, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, నాలుగో అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్ క్లాసెన్‌పై ఈ ఆరోపణలు మోపారు. క్లాసెన్ కూడా తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ రిచి రిచర్డ్‌సన్ విధించిన శిక్షను అంగీకరించక తప్పలేదు.
అంతకుముందు అదే మ్యాచ్‌లో క్లాసెన్‌కు, పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బంతి బాగోలేదని క్లాసెన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, రిజ్వాన్ దానిని పట్టించుకోకుండా ఆడమని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. చివరకు అంపైర్లు, ఇతర ఆటగాళ్లు కలుగజేసుకుని వారిని శాంతింపజేశారు. ఈ సమయంలో ఎవరో క్లాసెన్‌ను "నోరు మూసుకొని ఆడు" అని అనడం కూడా వినిపించింది.
క్లాసెన్ 97 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. క్లాసెన్ సెంచరీకి చేరువలో ఔట్ అవ్వడం, ఆపై జరిగిన పరిణామాలతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.