హీరో అవ్వమన్నా వినలేదు.. తాతయ్య కోరిక కోసమే డాక్టర్‌ని అయ్యాను..!
సురక్షిత్ లుక్ మరియు ఫిజిక్ చూసి ఆయనకు సినిమాల్లోకి రావాలని చాలా పెద్ద ఆఫర్లు వచ్చాయట. కానీ తనకు చిన్నప్పటి నుండి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని, వైద్య రంగంలో సేవ చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. "తాతయ్య ఎప్పుడూ మమ్మల్ని సినిమాల్లోకి వెళ్లవద్దని స్ట్రిక్ట్‌గా చెప్పలేదు. కానీ ఆయన పడ్డ కష్టాన్ని చూసి మేమే ఆ ప్రయత్నం చేయకూడదని నిర్ణయించుకున్నాం" అని వివరించారు.సురక్షిత్ కేవలం ఒక స్టార్ హీరో మనవడు మాత్రమే కాదు, తన రంగంలో అగ్రగామిగా ఎదిగారు. ఇటీవలే ఆయన ఒక మహిళ గర్భాశయం నుండి 4.5 కిలోల భారీ కణితిని 3డీ లాపరోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించారు. గతంలో ఒక డాక్టర్ 4.1 కిలోల కణితిని తొలగించి గిన్నిస్ రికార్డ్ సృష్టించగా, సురక్షిత్ ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. చెన్నైలో ఈ కేంద్రాన్ని స్థాపించి ఎంతో మందికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు.
తాతయ్య గురించి సురక్షిత్ మాట్లాడుతూ.. "ఆయన మాకు కేవలం ఆస్తులే కాదు, క్రమశిక్షణ మరియు సమయపాలనను కూడా వారసత్వంగా ఇచ్చారు. చెన్నైలో ఆయన సంపాదించిన భూములు, ఆస్తుల నిర్వహణ విషయంలో ఆయన దూరదృష్టిని మేం ఎప్పటికీ మరువలేం" అని చెప్పుకొచ్చారు.తాతయ్య పేరును వెండితెరపై కాకుండా, నిరుపేదల ప్రాణాలను కాపాడే వైద్యుడిగా సురక్షిత్ నిలబెడుతున్నారు. "వారసుడు అంటే ఇలా ఉండాలి" అంటూ శోభన్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో సురక్షిత్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.