రేణు దేశాయ్ పై వేధింపులు ఇద్దరు అరెస్ట్..!
అలా తన మీద అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్ లపైన ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేణు దేశాయ్ కంప్లైంట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలా రేణు దేశాయ్ పైన అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న ఇద్దరిని మార్చి 17వ తేదీన అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలతోని ఇద్దరినిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని విచారించి అనంతరం వీరు వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయం విచారణ చేపట్టబోతున్నారు. అలాగే మిగిలిన ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు.
గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రముఖ యాంకర్ గా పేరు సంపాదించిన యాంకర్ అనసూయను కూడా సోషల్ మీడియా వేదికగా వేధింపులు చేస్తూ అసభ్యకరమైన ఫోటోలు కామెంట్స్ చేస్తూ ఉండడంతో పోలీసులను ఆశ్రయించగా ఇటీవలే పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలను టార్గెట్ చేసుకుని మరి వారి పైన ఇలా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వారందరి పైన సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. తప్పుడు పనులు చేసే వారిని ఎవరిని వదలం అన్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.