ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గురించి తెలియని విషయాలు..!
డైరెక్టర్గా, నిర్మాతగా, రచయితగా సింగర్ గా కూడా తనదైన రంగాలలో సత్తా చాటిన పార్తీబన్ దాదాపుగా 16 చిత్రాలకు డైరెక్టర్గా వ్యవహరించారు, 14 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు, అలాగే 100 సినిమాలకు పైగా యాక్టర్ గా చేసిన ఈ నటుడు.. యుగానికి ఒక్కడు, పొన్నియన్ సెల్వన్ 1,2 , నేనూ రౌడీనే తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. పార్తీబన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. పార్తీబన్ ఒక తెలుగు నటిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ వీరిద్దరు విడాకులు తీసుకోవడం కూడా జరిగింది.
కానీ తన మాజీ భార్య పైన ప్రేమతో 24 ఏళ్లుగా సింగిల్ గానే ఉంటున్నారు. ఆ నటి ఎవరో కాదు సీత. ఈమె బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య సినిమాలో చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత పోలీస్ భార్య, చెవిలో పువ్వు తదితర చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది సీత. ముఖ్యంగా గంగోత్రి, సింహాద్రి, గౌతమ్ నంద, డెవిల్ తదితర చిత్రాలలో సహాయ నటిగా కూడా పేరు సంపాదించింది. 1990లో పార్తీబన్ సీతను ప్రేమించి వివాహం చేసుకోగా ,వీరికి ఇద్దరు కుమార్తెలు. అనంతరం వీరు ఒక కుమారుడిని కూడా దత్తకు తీసుకున్నారు. అయితే 2001లో కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఒంటరిగానే ఉన్నారు పార్తీబన్. అయితే తన మాజీ భార్య సీతను మాత్రం తాను గౌరవిస్తానని తన భార్యగా సీతకు స్థానం ఇచ్చాను ఆస్థానాన్ని మరొకరికి ఇవ్వలేను, నా ఇద్దరి కూతుర్లకు వివాహమయ్యింది నా కొడుకు నేను మాత్రమే సింగిల్ గానే ఉన్నాము. తాను సీతతో మాత్రం టచ్ లో లేను తన తల్లి మరణించినప్పుడు మాత్రం దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాలని ఒకానొక ఇంటర్వ్యూలో తెలియజేశారు.