కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ సినిమాలు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లను వసూలు చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ప్రధానంగా మారింది . ఇక్కడి నుండి భారీ ఎత్తున కలెక్షన్లు కొన్ని సినిమాలకు వస్తున్నాయి. ఇకపోతే ఓవర్సీస్ లో 20 మిలియన్ డాలర్ల కలెక్షన్లను ఇప్పటివరకు కేవలం ఆరుగురు ఇండియన్ హీరోలు మాత్రమే అందుకున్నారు. మరి ఆ ఆరుగురు హీరోలు ఎవరు ..? వారు ఎన్ని సినిమాలతో ఓవర్సీస్ లో 20 మిలియన్ డాలర్ కలెక్షన్లను అందుకున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.
ఓవర్ సీస్ లో అదిరిపోయే రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలలో షారుక్ ఖాన్ ఒకరు. ఈయన హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు ఈయన నటించిన 6 సినిమాలు ఓవర్ సీస్ లో 20 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాయి. ఈయన తర్వాత బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఎక్కువ సార్లు ఓవర్సీస్ లో 20 మిలియన్ మార్క్ ను అందుకున్నాడు. అమీర్ ఖాన్ నటించిన నాలుగు సినిమాలు ఓవర్సీస్ లో 20 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాయి. ఇక బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన మూడు సినిమాలు ఓవర్సీస్ లో 20 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాయి. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ నటించిన రెండు సినిమాలు , కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రజనీ కాంత్ నటించిన రెండు సినిమాలు , బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ నటించిన రెండు సినిమాలు ఓవర్సీస్ లో 20 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాయి. ఇలా ఈ ఆరుగురు హీరోలు నటించిన సినిమాలో ఓవర్సీస్ లో 20 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాయి.