"ప్లీజ్ డాడీ ఆ మాట ఇక్కడ చెప్పొద్దు"..అందరి ముందే అల్లు అరవింద్ కు అలా చెప్పిన బన్నీ..!?
"ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఏ తప్పు చేయలేదు ..నా ఫాన్స్ కి నేను రిక్వెస్ట్ చేశాను..నేను చేతులు ఊపడానికి కారణం అదే ..నేను చేతులు ఊపితే వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు ..అప్పుడు అక్కడ జనాభా వెళ్లిపోతారు. తద్వారా పోలీసులకే మేలు జరుగుతుంది ..క్రౌడ్ ఎక్కువగా వస్తే జనాలు ఇబ్బంది పడిపోతారు అన్న కారణంగానే కారులో ఉన్న నేను లేచి పైకి చేతులు ఊపాను ..అది ఏ రోడ్ షో కాదు ప్రచారం కాదు అంటూ తేల్చి చెప్పేసాడు". అంతేకాదు మాటల సందర్భంలో అల్లు అర్జున్ హాస్పిటల్ లో ఉన్న రేవతి కొడుకుకి చేయబోయే విషయాలను సైతం బయట పెట్టడానికి ట్రై చేశారు .
కానీ మధ్యలోనే ఆగిపోయాడు. లీగల్ పరంగా చిక్కులు ఎదుర్కొంటాడేమో అన్న భయంతోనే ఆగిపోయాడు అంటున్నారు జనాలు. అయితే అల్లు అరవింద్ పక్కనుండి శ్రీతేజ్ ను ఏ విధంగా ఆదుకోబోతున్నామో చెప్పచ్చు ..ఎలా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నామో మాట్లాడొచ్చు అంటూ చెప్తాడు . అయితే వెంటనే బన్నీ అవన్నీ ఇక్కడ వద్దు డాడీ ప్లీజ్ అవన్నీ మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు.. అదంతా వేరే మ్యాటర్ "అంటూ అందరి ముందే అల్లు అరవింద్ చెప్పబోయిన విషయాన్ని అడ్డుకుంటాడు .
అయితే ఇది బన్నీ చాలా కామన్ గానే చేశాడు . కానీ అల్లు అర్జున్ ఇది ఓవర్ యాక్టింగ్ గా చేశాడు అంటూ జనాలను ట్రోల్ చేస్తున్నారు . అల్లు అరవింద్ చెప్పాలి అనుకోవడం బన్నీ ఆపడం..ఆ మంచితనాన్ని పైకి తీసుకొచ్చేలా చేయడమే అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. అల్లు అరవింద్ - అల్లు అర్జున్ స్క్రిప్ట్ ప్రకారమే ఇలా ముందుకు వెళ్లారు అని .. ఆ విధంగానే మాట్లాడుకుంటున్నారు .. ఆ విధంగానే పేపర్ చూసి మాట్లాడాడు అని చాలా దారుణతి దారుణంగా బన్నీని ట్రోల్ చేస్తున్నారు..!