అల్లు అర్జున్ VS రేవంత్ రెడ్డి: అసలు తప్పు ఎవరిది..? ఎవరు అబద్ధం చెబుతున్నారు..?

Thota Jaya Madhuri
ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్లే మారుమ్రోగిపోతున్నాయి . దానికి కారణాలు కూడా మనందరికీ బాగా తెలిసిన విషయమే . అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ అయింది. పాన్ ఇండియా స్ధాయిలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ అయింది . అంతా బాగానే ఉంది సినిమాకి ముందు మెగా వెర్సెస్ అల్లు ఫ్యామిలీ అలాగే ఫ్యాన్స్ వార్ పిక్స్ కి చేరుకునింది. అయినా సరే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  అయితే సంధ్య థియేటర్లో బన్నీ సినిమా చూడడానికి ఫ్యామిలీతో సహా వచ్చారు .


ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని చూడడానికి జనాలు ఎగబడి పోయారు . ఈ క్రమంలోనే రేవతి అని బన్నీ ఫ్యాన్ మృతి చెందింది. ఆమె కొడుకు హాస్పిటల్ లో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు . ఆ తర్వాత మధ్యాంతర బెయిల్ పై బయటకి వచ్చారు. ఈ ఎపిసోడ్ వరకు అందరికీ తెలిసిందే . అయితే ఎవరు  ఊహించిన విధంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పేరు ప్రస్తావించడం .."అసలు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తమ పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా..? అనే విధంగా మాట్లాడటం సంచలనంగా మారింది".


అంతేకాదు అల్లు అర్జున్ కి ఆల్రెడీ పోలీసులు వచ్చి బయట జరిగిన విషయం చెప్పారు అని ..అయినా సరే అల్లు అర్జున్ తీరికగా సినిమా చూస్తూ వచ్చాడు అని .. ఇదే నా ఒక హీరోకి ఉండాల్సిన లక్షణం..? అంటూ కూడా మండిపడ్డారు . దీంతో బన్నీ రియాక్ట్ అయ్యాడు. ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఏ తప్పు చేయలేదు ..ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అంటూ ఘాటుగానే స్పందించారు . అసలు జరిగింది ఏంటి ..? అంటూ తన వర్షన్ ని వినిపించాడు . అయితే బన్నీ తన వద్దకు ఏ పోలీసులు రాలేదు అని ..పోలీసుల ఇంకా సెక్యూరిటీ ఇచ్చారు అని ..పర్మిషన్ లేనప్పుడు పోలీసులు సెక్యూరిటీ ఎలా ఇస్తారు..? అని తిరిగి ప్రశ్నించారు .


అయితే ఇద్దరి మాటలు విన్న తర్వాత జనాలకి బిగ్ డౌట్ వచ్చేసింది. ఎవరు అబద్ధం చెపుతున్నారు..? పోలీసులు వచ్చి చెప్పినా కూడా థియేటర్లో హ్యాపీగా సినిమా చూశాడు అంటున్నాడు రేవంత్ రెడ్డి . నా వద్దకు ఎవరు పోలీసులు రాలేదు నా మేనేజ్మెంట్ సభ్యులు వచ్చి నాకు బయట పరిస్థితి చాలా అన్ కంట్రోల్ గా ఉంది సార్ అంటూ చెప్పి నన్ను వెనక్కి పంపించేశారు అంటూ బన్నీ చెప్పారు . ఎవరి మాటలను నమ్మాలి .. బన్నీ వర్షన్ లో బన్నీ కరెక్ట్ ..రేవంత్ రెడ్డి వర్షన్ లో రేవంత్ రెడ్డి కరెక్ట్ . అసలు ఎవరిది తప్పు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .


అయితే చాలామంది బన్నీనే నెగిటివ్గా చూస్తున్నారు . అసలు బన్నీ అలా రోడ్ షో చేయకుండా ఉండాల్సింది అని.. బన్నీ కారణంగానే ఒక నిండు ప్రణం బలైపోయింది అని మండిపడుతున్నారు . కానీ బన్నీవర్షన్ లో బన్నీ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. అసలు దీనికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది అనేది మాత్రం అసలు అర్థం కావట్లేదు. మీ వర్షెన్ లో మీరేమనుకుంటున్నారు . రేవంత్ రెడ్డి చేసింది న్యాయమేనా ..? అల్లు అర్జున్ చెప్పింది నిజమేనా ..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: