ఆ ఒక్క కారణంతో "శంకర్"తో మూవీనే వద్దనుకున్న మహేష్.. సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా..?

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో శంకర్ ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దానితో శంకర్ కి తమిళ్ లో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు ఉంది. ఒకానొక సమయంలో ఈయన తీసిన సినిమాలు అన్ని అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈయన కాస్త ట్రాక్ తప్పడు. అయినా కూడా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు అంటే ప్రేక్షకులు చాలా వరకు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఇంత గొప్ప క్రేజ్ ఉన్న దర్శకుడితో సినిమా చేసే అవకాశం వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ ను రిజెక్ట్ రిజర్వ్ చేశాడట. మరి మహేష్ బాబు , శంకర్ లాంటి గొప్ప దర్శకుడితో సినిమా చేసే అవకాశం వస్తే ఎందుకు ఆ దానిని రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసు కుందాం.

శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా స్నేహితుడు అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన 3 ఇడియట్స్ అనే మూవీ కి రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ సినిమాను మొదటగా శంకర్ , విజయ్ తో కాకుండా మహేష్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను వెళ్లి సంప్రదించాడట. కానీ మహేష్ మాత్రం అమీర్ ఖాన్ చేసిన పాత్ర తనకు సూట్ కాదు అని ఆ సినిమాను తనపై చేసిన వర్కౌట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అని వేరే హీరోతో చేస్తే బెటర్ అని శంకర్ కి సలహా ఇచ్చి ఆ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. దానితో శంకర్ ఆ తర్వాత విజయ్ ను ఆ సినిమా విషయంలో అప్రోచ్ కావడం జరిగిందట. అలా శంకర్ ఆఫర్ ను మహేష్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: