నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి ఊర్వశి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.
ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను , ఒక పాటను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ను కూడా మేకర్స్ ఓపెన్ చేశారు. మొదట టెక్నీకల్ గ్లిచ్ రావడంతో షెడ్యూల్ చేసిన షోస్ ని క్యాన్సల్ చేసారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 256 షోస్ కి గానూ 1335 టిక్కెట్లు అమ్ముడు పోయాయి. దానితో గ్రాస్ వసూళ్లు 31 వేల డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా డాకు మహారాజ్ సినిమాకి ఓవర్సీస్ లో ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య నటిస్తున్న మూవీ కావడం , వాల్టేర్ వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు ప్రస్తుతానికి మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.