మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన సినిమా ఇది.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..భారీ హైప్ తో సెప్టెంబర్ 27 న రిలీజ్ అయినా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ కున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 550 కోట్లు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అయిన “వార్ 2 “మూవీ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ అయినా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ బిగ్గెస్ట్ మూవీకి కమిట్ అయ్యాడు.. ఆ మూవీ పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా జరిగాయి.. ఈ సినిమాకు “డ్రాగన్” అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ని పెట్టినట్లు సమాచారం.. ఈ మూవీని మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. ఈ సినిమా కథ గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మగధీర ‘ సినిమా కథని పోలి ఉంటుందని పునర్జన్మల నేపధ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఇలాంటి ఒక పాయింట్ ను తీసుకొని తన స్టైల్ మేకింగ్ తో మరింత అద్భుతంగా చూపించనున్నట్లు సమాచారం..