బన్నీ - రేవంత్ రెడ్డిలను మోసం చేసింది వీళ్లే..??
ఈ విషయాన్ని స్వయంగా బన్నీ చెప్పాడు కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? డీసీపీ అధికారి వచ్చి ఓవర్ క్రౌడ్ అవుతుంది సార్ వెళ్లిపోండి అని బన్నీని విజ్ఞప్తి చేసినా ఆయన వారిని లెక్క చేయలేదని, బన్నీ అంత అహంకారి అని ఆరోపిస్తున్నారు. ఈ రెండు వెర్షన్స్ వింటుంటే మనకి స్పష్టంగా కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందని తెలుస్తోంది. పోలీసులు ఒక మహిళ చనిపోయిన తర్వాత మేము పర్మిషన్ ఇవ్వలేదంటూ ప్లేట్ ఫిరాయించినట్లుగా అర్థమవుతుంది. ఈ పోలీసులే రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పైన ఉన్నవి లేనివి చెప్పినట్లుగా విశ్లేషకులకు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పేరు మర్చిపోవడం తర్వాత థియేటర్లో ఇలా వ్యవహరించడం ఈ రెండూ చూసిన తర్వాత రేవంత్ రెడ్డిలో అతనిపై బాగా కోపం పెరిగిపోయి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
ఇక నిర్మాత బన్నీ వాసు కూడా అల్లు అర్జున్ కు నష్టమే చేశాడు కానీ మంచి ఏమీ చేయలేదు. సంఘటన జరిగిన వెంటనే ఈ హీరో ఆ పిల్లోడిని కలవడానికి వెళ్తానని చెప్పినప్పుడు ఆయన "వద్దు లీగల్ గా అది నేరం" అంటూ అల్లు అర్జున్ ని కట్టేశాడు. అతన్ని వెంటనే టాప్ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని బన్నీ చెప్పి ఉంటే అతనిపై ఇంత విమర్శలు వచ్చి ఉండేవే కాదు. కనీసం శ్రీ తేజ్‌ను పరామర్శించినా అల్లు అర్జున్ దేవుడు అయిపోయి ఉండేవాడు. బాధిత ఫ్యామిలీ ఎంతో సంతోషించేది అందరూ అతని నిజమైన హీరో అని పొగిడేవారు.
పరామర్శించడం చట్ట విరుద్ధమని ఏ న్యాయస్థానమూ చెప్పడం లేదు. జరిగిన దుర్ఘటన ఎవరూ కావాలని చేయలేదు. బన్నీకి ఆ ఫ్యామిలీని కలవాలనే ఉంది. అతను వారికి చాలా మంచి చేయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఆయన లీగల్ టీం తో పాటు ఆయన పక్కనున్న బన్నీ వాసు లాంటి వారు మాత్రం ఏమీ చేయనివ్వకుండా ఉంచుతున్నారు. దీని ఫలితంగా ప్రజల్లో 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్న కఠినాత్ముడు అనే ఒక చెడ్డ పేరు అల్లు అర్జున్ కి వస్తోంది. అంతేకాదు రేవంత్ రెడ్డికి సైతం ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తోంది.