రెండుగా చీలిన టాలీవుడ్...జగన్ వర్సెస్ రేవంత్ ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ నేపథ్యంలో... రెండుగా ఇండస్ట్రీ చీలినట్లు చెబుతున్నారు. తాజాగా అల్లు అర్జున్.... పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనాలు చస్తూ ఉంటే రోడ్ షో చేశాడని... అతని వల్ల మరణించిన కుటుంబాన్ని పట్టించుకోలేదని... అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
 అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... కొంతమంది అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తుంటే... మరికొంతమంది మాత్రం... భయపడవలేక ఇతర కారణాల వల్ల రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.  అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కరెక్ట్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు.
 టికెట్ ధరలను పెంచకూడదని... అప్పట్లో జగన్ కఠినంగా వ్యవహరించారు. దీంతో చిత్ర పరిశ్రమ కు చెందిన ప్రముఖ హీరోలందరూ జగన్ వద్దకు వెళ్లి... టికెట్ ధరలను పెంచాలని వేడుకున్నారు. అయితే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. హీరోలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని... జగన్మోహన్ రెడ్డిని విలన్ చేశారు టాలీవుడ్ ప్రముఖులు. దీంతో జగన్మోహన్ రెడ్డి పై... తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకత కచ్చితంగా కనిపించింది.
 అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం... బలవంతంగానో లేక ఇతర కారణాలవల్లో... రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జోకడం మొదలుపెట్టారు కొంతమంది ప్రముఖులు. దీనివల్ల అల్లు అర్జున్ ఇరుకున పడే ప్రమాదం వచ్చింది.  ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందని.. కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే... హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకొని... సినిమా రిలీజ్ చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు ప్రముఖులు. అప్పుడు టికెట్ల ధర పెంచాల్సిన అవసరం ఉండకుండా.. ప్రభుత్వాన్ని బతిలాడుకునే అవసరం ఉండదని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: