వెంక‌టేష్ - కాజ‌ల్ కాంబోలో మిస్ అయిన ప‌ర‌మ‌చెత్త సినిమా ఇదే.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఆచితూచి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వెంక‌టేష్ అంటే నే స‌హ‌జంగా అంద‌రికి ఫ్యామిలీ ఎంట‌ర్టై న‌ర్ సినిమా లే గుర్తుకు వ‌స్తాయి. వెంకీ సినిమాల్లో ఎక్కువ ఫ్యామిలీ సినిమాలే. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ పోటీలో భారీ అంచనాలతో సంక్రాంతికి వచ్చే డిజాస్టర్ అయింది. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా అనిల్  రావిపుడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీకి జోడిగా మీనాక్షి చౌదరి - ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే వెంకటేష్ ... సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమా అనుకోని కారణాలవల్ల మిస్సైంది.

వెంకటేష్ పక్కన నటించే అవకాశం వచ్చిన కూడా కాజల్ ఎందుకో ? ఇష్టపడలేదు. వెంకటేష్ - నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన వెంకీ మామ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్గా మంచి మార్కులు వేయించుకుంది. ఇందులో నాగచైత‌న్య కు జోడిగా రాశీ కన్నా నటిస్తే ... వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటించింది. వాల్తేరు వీర‌య్య లాంటి సూపర్ హిట్ కొట్టి ప్రస్తుతం బాలయ్యతో డాకు మహారాజ్ తెరకెక్కిస్తున్న కొల్లి బాబి ఈ సినిమా కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ముందుగా పాయల్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని సంప్రదిస్తే ఆ పాత్ర చేయడానికి కానీ ఒప్పుకోలేదట. వెంకటేష్ పక్కన నటించడం అందులో నువ్వు నాగచైతన్య కు అత్తగా నటించడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పిందట. గతంలో నాగచైతన్య - కాజల్ కాంబినేషన్లో దడ సినిమా వచ్చి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: