డైవోర్స్ అయ్యాయిగా... పార్టీ ఉంది పుష్పా... !
విడాకులకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి .. అయితే విడిపోవటాన్ని ఒక బాధాకరమైన విషయంగా ఎవరు భావించడం లేదు. పెళ్లి పెటాకులవగానే గతంలోనే అమ్మాయిలు తలని మోకాళ్ల పై పెట్టుకుని ఏడుస్తూ కూర్చోవట్లేదు. అబ్బాయిలు దేవదాసు లా అయిపోవడం లేదు. విచిత్రమైనటువంటి పెళ్లి చేసుకున్నప్పుడు అతిధులకు ఘనంగా పార్టీలు ఇస్తున్నట్టే విడిపోయాక కూడా వేడుకలు చేసుకుంటున్నారు .. ఇది సంతోషించాల్సిన విషయం కాక మరేంటి పైగా ఇది డైవర్స్ పార్టీ అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో గ్రూపులు గ్రూపులు కడుతున్నారు .. కలిసి బతకలేనప్పుడు విడిపోవడమే నయం .. ఆ తర్వాత ఇలా అయింది ఏంటి అని జీవితం అంతా బాధపడటం కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం బెటర్ అని అంటున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు డైవర్స్ పార్టీలు చేసుకుంటున్నా.రు ఈ ట్రెండ్ మెట్రో నగరాలు .. పట్టణాల్లో మొదలవుతోంది .. పల్లెల వరకు ఇంకా చేరలేదు. భవిష్యత్తులో డైవర్స్ తీసుకున్న వాళ్ళందరూ ఒకే చోటచేరి పార్టీలు చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక్కడ ఏమీ లేదు విడిపోయిన వాళ్ళు ఆ బాధను మర్చిపోయి హ్యాపీగా కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.