సంక్రాంతి ప్రత్యేకం: మనవడిపై ఫోకస్ చంద్రబాబు స్మైల్ వైరల్!
చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ పక్కనే కూర్చుని, వాడు ఆడే ప్రతి ఆటను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. దేవాన్ష్ గాలిపటం ఎగురవేస్తుంటే, పక్కనే ఉండి టిప్స్ ఇస్తూ, అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూ బాబు ప్రోత్సహించడం చూస్తుంటే "రాజకీయాల కంటే కుటుంబమే మిన్న" అనే భావన కలుగుతోంది. దేవాన్ష్ అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెబుతూ, మనవడితో కలిసి నవ్వుతూ కనిపించిన బాబును చూసి స్థానికులు "మా బాబు గారు భలే మురిసిపోతున్నారు" అని అనుకుంటున్నారు.ఒకవైపు తాత-మనవళ్ల సందడి ఉంటే, మరోవైపు నారా లోకేష్, బ్రాహ్మణి జంట కూడా ఈ పండుగ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పల్లెటూరి సంప్రదాయ వస్త్రధారణలో లోకేష్ మాస్ లుక్ లో అదరగొడుతుంటే, బ్రాహ్మణి తన క్లాస్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ తో పండుగకు మరింత శోభను తెచ్చారు. కుటుంబ సభ్యులందరూ కలిసి భోగి మంటల వద్ద కూర్చుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం నారావారిపల్లె ప్రజలకు ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ లా అనిపించింది.
ముఖ్యమంత్రి అంటే ఎప్పుడూ సెక్యూరిటీ, కాన్వాయ్ లు ఉంటాయి. కానీ నారావారిపల్లెలో చంద్రబాబు ఆ హంగులన్నీ పక్కన పెట్టి సామాన్య పౌరుడిలా తన గ్రామస్తులతో మమేకమయ్యారు. వీధుల్లో నడుస్తూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సాగారు. మనవడు దేవాన్ష్ కూడా గ్రామస్తులతో కలిసి సరదాగా ముచ్చటించడం చూస్తుంటే నారా వారి తర్వాతి తరం కూడా ప్రజల్లోనే పెరుగుతోందని అర్థమవుతోంది.పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడానికి పండుగలు ఎంత ముఖ్యమో చంద్రబాబు నాయుడు ఈ పర్యటన ద్వారా నిరూపించారు. మనవడు దేవాన్ష్ ఆటలు చూస్తూ చంద్రబాబు పొందిన ఆ సంతోషం.. ఆయన అభిమానులకు పండుగ గిఫ్ట్ అని చెప్పొచ్చు.
https://cdn.jwplayer.com/videos/blKrxVwY.mp4#t=0.5