మళ్లీ తెరపైకి విక్రమార్కుడు 2.. హీరో ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రలలో నటించాడు. ఓ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా ... మరో పాత్రలో దొంగగా కనిపించాడు.

రెండు పాత్రలలో అద్భుతమైన వేరియేషన్స్ ను చూపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీ కి కొనసాగింపుగా విక్రమార్కుడు 2 అనే సినిమా రాబోతుంది అని వార్తలు బయటకు వచ్చాయి. ఆ వార్తలకు తగినట్లుగానే విక్రమార్కుడు 2 కి మూవీ కి సంబంధించిన కథను ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ గారు రెడీ చేశారు అని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దానితో ఈ మూవీ త్వరగానే స్టార్ట్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీ స్టార్ట్ కాలేదు. మళ్లీ తాజాగా విక్రమార్కుడు 2 కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... విక్రమార్కుడు 2 సినిమాలో చిరంజీవి నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలోనూ ఓ సినిమాలో , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో సినిమాలోనూ నటించడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: