ఏంటి స్టార్ దర్శకుడైన త్రివిక్రమ్ ఆ నటుడి ఇంట్లో దొంగతనం చేశారా.. ఇది నిజమేనా.. ఇంతకీ త్రివిక్రమ్ కి దొంగతనం చేయాల్సిన పని ఏముంది..అనేది ఇప్పుడు తెలుసుకుందాం..సినిమాల్లోకి రాకముందు మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పనక్కర్లేదు. ఒక చిన్న రూమ్ లో సునీల్ తో కలిసి ఉండేవాడు. తినడానికి తిండి లేక డబ్బులు చేతిలో లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ సమయంలో త్రివిక్రమ్ ఓ నటుడి ఇంట్లో దొంగతనం చేశారట. అది కూడా మందు బాటిల్స్ అట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ సునీల్ సినిమాల్లోకి రాకముందు నుండే మంచి ఫ్రెండ్స్..వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ అవకాశాల కోసం వెతుక్కునేవారు.
అలా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో సునీల్ కి ఒక ప్రత్యేకమైన పాత్రని రాసుకునేవారు.అలా సునీల్ త్రివిక్రమ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అయితే త్రివిక్రమ్ సినిమాలకు దర్శకత్వం వహించక ముందు నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో మందు బాటిళ్లను దొంగతనం చేసేవాడట. అయితే ఈ విషయాన్ని త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమా 20 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా సక్సెస్ మీట్ లో బయటపెట్టారు. త్రివిక్రమ్ ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ కాకముందు అర్ధరాత్రి ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగి తినేవాళ్ళం. అయితే సినిమాల్లోకి రాకముందే ప్రకాష్ రాజ్ నాకు పరిచయం ఉంది.
అలా అర్ధరాత్రి వెళ్లి వారిని ఇబ్బంది పెట్టే వాళ్ళం. అంతే కాదు అర్ధరాత్రి నేను ఆయన ఇంట్లో మందు బాటిల్లు కొట్టేసేవాడిని. ఇక నేను వెళ్తే ప్రకాష్ రాజ్ భయపడేవాడు. వీడు ఇంట్లో నుండి మందు బాటిల్ కొట్టేస్తాడు కావచ్చని.కానీ ఒక్కసారి కూడా నన్ను పల్లెత్తి మాట అనలేదు.పల్లెటూరు నుండి వచ్చారు భవిష్యత్తులో ఏదైనా బాగుపడతారు కావచ్చు అని అనుకునేవాడేమో. కానీ నన్నయితే ఒక్క మాట కూడా అనలేదు. మమ్మల్ని భరించాడు.అందరూ ప్రకాష్ రాజ్ కి భయపడితే ప్రకాష్ రాజ్ నాకు భయపడేవారు అంటూ త్రివిక్రమ్ ఆ ఈవెంట్లో ఎవరికి తెలియని ఓ సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు