సినిమా చూడాలని ఉంటే అలా చెయ్యి బన్నీ.. ఈ పబ్లిసిటీ మీకు అవసరమా?
ఒకవేళ ఫ్యాన్స్ మధ్య సినిమా చూడాలని బన్నీ భావిస్తే మాస్క్ వేసుకుని సినిమా మొదలైన తర్వాత వెళ్లొచ్చని అంతే తప్ప పబ్లిసిటీ కోసం వ్యవహరించి ఇప్పుడు తప్పు లేదనే విధంగా కామెంట్లు చేయడం ఎంతవరకు రైట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ ఏదో చేయాలని వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వెర్షన్ ప్రభుత్వానికి ఉంటే బన్నీ వెర్షన్ బన్నీకీ ఉంది.
జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదని బన్నీ చెబుతున్నా సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లకుండా ఉండి ఉంటే ఈ ఘటన జరిగేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. బన్నీలాంటి హీరో మంచి చేసి ఎంతోమందికి స్పూర్తిగా నిలవాల్సిన హీరో అని అలాంటి హీరో తను చేస్తున్న చిన్నచిన్న తప్పుల వల్ల ఎంతోమందికి శత్రువు అవుతున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
సంధ్య థియేటర్ ఘటన విషయంలో తప్పు ఎవరిదో తేల్చడం ఎవరి వల్ల కావడం లేదు. ప్రభుత్వం చెప్పిన కామెంట్లలోనే నిజం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పారితోషికం విషయంలో అల్లు అర్జున్ టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీ భారీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.