ఇండస్ట్రీలో కొత్త చర్చ: సందీప్ రెడ్డి వంగా VS అనిల్ రావిపూడి..ఆ లక్కి ఛాన్స్ ఎవ్వరికి..?!
ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవి చాలా ఆనందపడి, అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన మాట ఇచ్చారట. “ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా రామ్ చరణ్‌తో నీకు సినిమా చేసే ఛాన్స్ ఇస్తాను” అని చిరంజీవి ప్రామిస్ చేశారట.ఇప్పుడు ఆ ప్రామిస్ నిజమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ అంతా ఒకే ప్రశ్న అడుగుతోంది —రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో ఎప్పుడు?
కానీ ఇక్కడే మరో ట్విస్ట్ మొదలైంది.ఇప్పటికే రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగాకి కూడా మాట ఇచ్చాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ‘అనిమల్ పార్క్’ సినిమా పూర్తయ్యాక, అలాగే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన సినిమా అయిపోయిన వెంటనే, చరణ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. సందీప్ రెడ్డి వంగా స్టైల్ అంటే ఇంటెన్స్ ఎమోషన్, రా రియలిజం, ఇంటర్నేషనల్ అప్పీల్. అలాంటి దర్శకుడితో సినిమా చేస్తే రామ్ చరణ్ యొక్క గ్లోబల్ ఇమేజ్ ఇంకా భారీగా పెరుగుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే “ఆర్ ఆర్ ఆర్” తర్వాత చరణ్‌కు వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ పెరిగింది. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా సినిమా వస్తే, అతని క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం అనే చర్చ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అదే సమయంలో, అనిల్ రావిపూడి కూడా టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్‌గా నిలిచాడు. ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటాయి. చిరంజీవి సినిమాతో ఆయన మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మాట కాబట్టి, చరణ్ అనిల్ రావిపూడితో సినిమా చేయడం కూడా చాలా కీలకంగా మారింది. ఇలా ఇప్పుడు టాలీవుడ్లో రెండు బలమైన కాంబినేషన్లు పోటీలో ఉన్నాయి..ఒకవైపు రామ్ చరణ్ – సందీప్ రెడ్డి వంగా..మరోవైపు రామ్ చరణ్ – అనిల్ రావిపూడి.
ఈ రెండు కాంబోలలో ఏది ముందుగా ఫిక్స్ అవుతుందో, ఎవరి చేతికి గ్రీన్ సిగ్నల్ పడుతుందో అనే ఉత్కంఠతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం మీద చర్చలు, పోల్స్, ఫ్యాన్ వార్స్ కూడా మొదలయ్యాయి.మొత్తానికి చెప్పాలంటే, రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరి చేతిలో పడుతుందో అన్నది ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ హాట్ టాపిక్ అయింది. ఈ పోటీలో గెలిచేది సందీప్ రెడ్డి వంగా కావచ్చా? లేక మెగా ప్రామిస్‌తో అనిల్ రావిపూడి ముందుకు దూసుకుపోతాడా? ఈ ప్రశ్నకు సమాధానం త్వరలోనే రాబోతోంది.