బిగ్ బాస్ 8 విజేత నిఖిల్ కి సినిమా అవకాశాలు..?
అంతేకాదు నిఖిల్ స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.
ఇక పోతే నిఖిల్ లవ్ లైఫ్ కి వస్తే.. నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ చేసిన కావ్య శ్రీతో రిలేషన్షిప్లో ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక యాస్మితో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించింది. చివర్లో బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నారు. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ప్రశ్నించినప్పుడు.. మన లైఫ్ లో ఉండాలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అంటూ చెప్పుకొచ్చారు. ఇక యాస్మి గురించి అడిగితే.. తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేశాడు. బిగ్‌బాస్ విన్నర్ అవ్వడం న జీవితాన్ని మరో మలుపు తిప్పిందని అన్నాడు. బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన తర్వాత కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయని నిఖిల్ చెప్పాడు.