బన్నీకి ఏమైంది..? ప్రెస్ మీట్ లో పదే పదే ఎందుకు అలా ప్రవర్తించాడు..?

Thota Jaya Madhuri
ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు . అసలు అల్లు అర్జున్ కి ఏమైంది? ఎందుకు అంతలా ప్రెస్ మీట్ లో హై రేంజ్ లో మాట్లాడాల్సి వచ్చింది.  అల్లు అర్జున్ చాలా నెమ్మదస్తాడు. ఎక్కడ కూడా ఫైర్ అయిన సందర్భాలు మనం చూడలేం . చాలా రేర్ గానే అలా చూస్తూ ఉంటాం. అలాంటి అల్లు అర్జున్ ఎందుకు తన క్యారెక్టర్ ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు ..దయచేసి ప్లీజ్ ప్లీజ్ అలా చేయొద్దు అంటూ మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి అంతలా రిక్వెస్ట్ చేశారు . మీడియా ప్రతినిధులు ఏ ప్రశ్న అడుగుతున్నా కూడా అల్లు అర్జున్ సమాధానమే ఇవ్వలేదు . తన వర్షెన్ తాను చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది..? సెల్ఫీ వీడియోలో చెప్పొచ్చుగా..? మీడియా రిపోర్టర్స్ ని పిలిచినప్పుడు అంతే గౌరవంగా వాళ్లను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు రియాక్ట్ అవ్వాలి.. మరి అల్లు అర్జున్ ఎందుకు అలా చేయలేదు ..? అంటూ రకాలుగా మాట్లాడుతున్నారు జనాలు .


అయితే ఇదే మూమెంట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ప్రవర్తించిన తీరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన మొదలు ఎండింగ్ వరకు చాలా సందర్భాలలో టంగ్ స్లిప్ అవ్వడానికి ట్రై చేశారు. అల్లు అర్జున్ తెలియకుండానే చాలా కోపానికి గురైపోయాడు . అయితే అలాంటి సందర్భాలలో అల్లు అర్జున్ గడ్డం నిమురుకుంటూ చాలా సందర్భాలలో ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు.  మరీ ముఖ్యంగా తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ కళ్ళల్లో నీళ్లు రావడం .. ఆ నీళ్లను అల్లు అర్జున్ ఆపుకోవడం .. అదేవిధంగా తను ఏం మాట్లాడుతున్నాడో తెలియక కోపాన్ని కంట్రోల్ చేసుకునే పద్ధతిలో గడ్డాన్ని నిమురుకోవడం.. జుట్టు సరి చేసుకోవడం మనం బాగా చూసాం.


ఆఫ్ కోర్స్ ఇది చాలామంది పుష్పరాజ్ స్టైల్ అనుకుంటారు . కానీ అది కానే కాదు . అది అల్లు అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకునే మేనేజ్మెంట్ స్కిల్స్ . ఎవరికైనా సరే తన క్యారెక్టర్ ని దెబ్బతీస్తే కోపం వస్తుంది. పైగా 22 ఏళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరుని ఇలా ఒక్క రాత్రికి చెడగొట్టాలి అని చూడడం చాలా చాలా బాధాకరం అంటూ కూడా అల్లు అరవింద్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు . అయితే అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ తన ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోవడం గమనార్హం . భయపడి పేరు ఎత్తలేదా..? లేకపోతే రూల్స్ అడ్డొచ్చాయో..? తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్.. రేవంత్ రెడ్డికి భయ పడ్డాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: