చిరు తర్వాత ఆ స్టార్ హీరోని పట్టిన అనిల్ రావిపూడి.. మళ్లీ అదే ఫార్ములా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈయన ఆఖరుగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ప్రస్తుతం అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ హీరో గా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే వెంకటేష్ , అనిల్ కాంబో లో రూపొందిన ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం వీరి కాంబోలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తర్వాత అనిల్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే చిరంజీవి తో సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాగార్జున 100 వ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ , వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్ తన తదుపరి 2 మూవీ ల విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: