నేషనల్ మ్యాథమెటిక్స్ డే స్పెషల్.. శ్రీనివాస రామానుజన్ గొప్పదనం మీకు తెలుసా?

Reddy P Rajasekhar
ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 22వ తేదీన శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేను జరుపుకొంటారు. గణితంలో దేశంలోని మేధావులలో శ్రీనివాస రామానుజన్ ఒకరు. శాస్త్రవేత్త రామానుజన్ కెరీర్ పరంగా ఎదిగే విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సున్నాను సున్నాతో భాగిస్తే ఎంత వస్తుందనే ప్రశ్నతో మాస్టర్లనే రామానుజన్ ఆశ్చర్యపరిచారు.
 
శ్రీనివాస రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగార్ గుమస్తాగా పని చేసి చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించేవారు. రామానుజన్ తను కనిపెట్టిన సూత్రాలను చిత్తు పేపర్లపై వేసేవారు. బండలపై కూడా రామానుజన్ ఫార్ములాలు రాసేవారు. పై చదువుల కోసం మద్రాస్ కాలేజ్ కు వెళ్లే సమయంలో ఫీజు కట్టలేక అడ్మిషన్ దొరకలేదు. అయితే తను కనిపెట్టిన గణిత సూత్రాలను ఒక ప్రొఫెసర్ ముందు ప్రదర్శించి రామానుజన్ అడ్మిషన్ పొందారు.
 
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీహెచ్ హార్డీ వల్ల రామానుజన్ జీవితం మలుపు తిరిగిందని చెప్పవచ్చు. లైఫ్ మలుపు తిరగగా అక్కడ ఎన్నో సిద్దాంతాలను కనిపెట్టడం గమనార్హం. శ్రీనివాస రామానుజన్ సాధించిన సంచలన విజయాలు మాత్రం అన్నీఇన్నీ కావు. 1729 నంబర్ యొక్క ప్రత్యేకత గురించి శ్రీనివాస రామానుజన్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
మ్యాథ్స్ లో ప్రతిభ ఉన్నవాళ్లు దూరదృష్టితో గణితంపై ఫోకస్ పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. గణితంలో చిన్నతనం నుంచి దృష్టి పెట్టడం వల్ల సులువుగా లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మ్యాథ్స్ కు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదని సమాచారం అందుతోంది. శ్రీనివాస రామానుజన్ సాధించిన విజయాలు నేటి తరం యూత్ కు ఎంతో ఇన్సిరేషన్ గా నిలుస్తాయి. శ్రీనివాస రామానుజన్ క్రియేట్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయడం ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తల వల్ల కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: