ఈ హీరో పరిస్ధితి పగవాడికి కూడా వద్దు రా సామీ..ఫుల్ టైం బ్యాడ్..!
ఇది మాత్రమే కాదు, ‘ధురంధర్’కి ముందుగా సూపర్ హీరో జానర్‌లో కూడా అడుగుపెట్టాలని రణవీర్ ఆలోచించాడట. ప్రసిద్ధ టెలివిజన్ పాత్ర ఆధారంగా రూపొందించే శక్తి మ్యాన్ సిరీస్‌ను సినిమాగా తీసుకురావాలని ఆయన ఆసక్తి చూపినట్టు సమాచారం. భారతీయ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ఈ పాత్రను ఆధునిక సాంకేతికతతో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరపైకి తీసుకురావాలని ప్రణాళిక వేసినా, భారీ బడ్జెట్ అవసరం కారణంగా ఆ ఆలోచన నిలిచిపోయింది. సరైన ఫైనాన్షియల్ మద్దతు లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేకపోయింది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తో కలిసి ‘బ్రహ్మ రాక్షస’ అనే చిత్రాన్ని చేయాలని కూడా రణవీర్ అంగీకరించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. భారతీయ పురాణాల నేపథ్యంతో ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రణాళిక వేసినా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయింది. స్క్రిప్ట్ మార్పులు, బడ్జెట్ సమస్యలు లేదా తేదీల అనుసంధానం కుదరకపోవడం వంటి అంశాలు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం రణవీర్ చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ‘ప్రళయ్’ అని తెలుస్తోంది. ఇది కూడా ‘ధురంధర్’కి ముందే అంగీకరించిన చిత్రం. ముంబై నగరంలో జాంబీలు విరుచుకుపడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. హాలీవుడ్ తరహా టెక్నికల్ స్టాండర్డ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. బాలీవుడ్‌లో జాంబీ జానర్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోందని టాక్.