ఎన్ని చెప్పినా శ్రీతేజ్ కు అమ్మ లేని లోటు తీరుతుందా.. బన్నీ ఈ ప్రశ్నలకు జవాబులేవి?

Reddy P Rajasekhar
స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయనపై సింపతీ పెరగడానికి బదులుగా ట్రోలింగ్ పెరుగుతోంది. సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ తప్పు ఉందని తాజాగా వైరల్ అయిన వీడియో వల్ల ప్రూవ్ అవుతోంది. బన్నీ వైపు వేళ్లు ఉండగా ఈ ఘటన విషయంలో బన్నీకి శిక్ష పడాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్ని చెప్పినా శ్రీతేజ్ కు అమ్మ లేని లోటు తీరుతుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఎంత చికిత్స చేసినా శ్రీతేజ్ మునుపటిలా కోలుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సంధ్య థియేటర్ కు వెళ్లే విషయంలో అనుమతులు ఉన్నాయో లేదో బన్నీకి పూర్తిస్థాయిలో అవగాహన ఉందని తెలుస్తోంది. పుష్ప2 ఘటన వల్ల ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిత్ షోలకు సైతం అనుమతులు ఉండబోవని సమాచారం అందుతోంది.
 
బన్నీ హీరోగా గత 22 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న బ్రాండ్ వాల్యూ ఈ ఒక్క ఘటనతో పోయినట్టు అవుతోందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ కామెంట్లలో చాలావరకు నిజం లేదని మెజారిటీ అధారాలతో ప్రూవ్ కావడంతో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ సినీ కెరీర్ కు ఈ ఘటన పెద్ద దెబ్బేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
పుష్ప ది రూల్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నా వివాదం అంతకంతకూ ముదురుతోంది. గత శుక్రవారం రోజున ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కాగా ఆ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడం లేదు. బన్నీ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ భవిష్యత్తులో పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: