దిల్ రాజు మామూలోడు కాదు.. రేవంత్ ను ముందే సెట్ చేసుకున్నాడా?

praveen
సంధ్య థియేటర్‌లో ఒక మహిళ చనిపోయిన సంఘటనపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దానంతటకీ కారణం అల్లు అర్జునే అని రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు. అలాగే ఇకపై తెలంగాణలో తమ ప్రభుత్వం ఉన్నంతకాలం బెనిఫిట్ షోలు ఉండవని కుండ బద్దలు కొడుతున్నారు. ఇది తెలుగు నిర్మాతలకు చాలా పెద్ద షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా వ్యాపారం బాగా చేస్తుంటారు. ముందుగానే డబ్బులు దండుకోడానికే ఆయన ప్లాన్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో దిల్ రాజ్ కి అది ఒక మింగుడు పడని విషయం అయ్యింది.
ఆయన భారీ బడ్జెట్ పెట్టి నిర్మించిన గేమ్ చేజర్ సినిమా జనవరి 10న రానుంది. అంటే ఇంకొక రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది కానీ సంధ్యా థియేటర్ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అసెంబ్లీలో బన్నీపై రేవంత్‌ షాకింగ్ అలిగేషన్స్ చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తనకు నచ్చలేదంటూ అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. రేవతి చనిపోయిన ఇలాంటి సమయంలో బెనిఫిట్ చేయాలి మళ్లీ పెట్టడం సాధ్యమేనా అనేది ప్రశ్నార్ధకమయ్యింది.
అయితే దిల్ రాజు రేవంత్ రెడ్డితో చాలా అనుకువగా  మాట్లాడుతూ తనకు కావాల్సిన పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు టేకప్ చేశారు. ఈ తెలుగు రాష్ట్రానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఒక బ్రిడ్జి లాగా నిలవనున్నారు. ఆ హోదాలో ఉన్న ఆయన తన గేమ్ చేంజెర్ మూవీ బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారట. టికెట్ ప్రైసెస్ హెవీగా కాకుండా ఓ మోస్తారుగా పెంచి ఎవరూ నష్టపోకుండా చూడాలని చూస్తున్నారట. ఈ విషయం గురించి ఆల్రెడీ రేవంత్ రెడ్డితో మాట్లాడగా, ఆయన ఓకే చెప్పినట్లుగా సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే బాగానే సెట్ చేశాడన్నమాట. ఈ క్రమంలో ఆయన తన సినిమాకి వచ్చే నష్టమేమీ లేదన్నట్లు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి కానుకగా రానున్న డాకు మహారాజు సినిమా విషయంలోనూ తన మద్దతు పూర్తిగా ఉంటుందని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: